ఇప్పటికే ఇటు ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకు విల విలలాడుతున్న పాకిస్తాన్ బలూచిస్తాన్ ఏర్పాటు వాదంతో అంతర్గతంగా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. అయితే పాకిస్థాన్లో ఇప్పుడు మరో ప్రాంతంలో ఏర్పాటు వాదం ప్రారంభమైంది. సింధు ప్రాంత ప్రజలు అందరూ తమను సింధువేశ్ గా గుర్తించాలని ప్రత్యేక దేశం గా చేయాలన్న ఉద్యమాన్ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఆందోళనకారులు సింధు రాష్ట్రంలో హోం మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు. ఆ రాష్ట్రంలో స్కూలు బస్సు పై డ్రోన్ దాడి జరిగింది .. పిల్లలు చనిపోయారు. దీంతో ప్రజల్లో అలజడి చెలరేగింది .. పనికిమాలిన ప్రభుత్వం అని విరుచుకు పడుతూ ప్రజలు హోంమంత్రి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ గొడవలు అంతకు అంతకు పెరిగిపోతున్నాయి.


మరోవైపు భారత సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో నీటి కొరత పెరిగిపోయి పాకిస్థాన్ ప్రజల్లో అసహనం పెరుగుతుంది. సింధు ప్రాంతంలో అంతర్గత సంక్షోభం పెరిగింది. నీటి కొర‌త‌ కారణంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. కొన్నిచోట్ల హింసాత్మకంగా సంఘటనలు జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు ... అధికారుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. సింధు ప్రాంతంలో సింధు దేశ ఉద్యమం ఊపందు కుంటోంది. సింధ్ ప్రాంతాన్ని పాకిస్తాన్ నుంచి వేరు చేసి స్వతంత్ర దేశంగా ప్రకటించాలని లక్ష్యంతో వీరంతా పనిచేస్తున్నారు. ఇప్పటికే బలూచిస్తాన్‌ ప్రాంతం కూడా ప్రత్యేక దేశం గా ప్రకటించుకుంది. అక్కడ పాకిస్తాన్ సైన్యం ఇప్పటికీ చేరుకోలేదు. ఇప్పుడు సింధు దేశం కూడా విడిపోతే పాకిస్తాన్ మ‌రెన్ని ముక్క‌లు చెక్కులు అవుతుందో ?  చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: