గత కొద్దిరోజుల నుండి తెలంగాణలో రాజకీయాలు మారిపోయాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ముఖ్యంగా బీఆర్ఎస్ లో కేసీఆర్ కుమార్తె కవిత తిరుగుబాటు బాగవుటా ఎగురవేస్తుందని, బీఆర్ఎస్ పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించకపోతే ఉద్యమకారులు అందర్నీ కలుపుకొని కొత్త పార్టీ పెడతాను అంటూ బెదిరిస్తుంది అనే వార్తలు వినిపించాయి. ఇక ఈ వార్తలకు అనుగుణంగానే కేసీఆర్ పై కవిత రాసిన ఒక సంచలన లేఖ బయటికి వచ్చింది.అయితే ఈ లేఖపై ఇప్పటివరకు కేసీఆర్ స్పందించకపోయినప్పటికీ కేటీఆర్ మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. అయితే బీఆర్ఎస్ ప్రజాస్వామ్య పార్టీ అని ఎవరైనా లేఖలు రాసుకోవచ్చు అని,కానీ ఇలా పార్టీ అంతర్గత విషయాలను బయట చెప్పకూడదంటూ మాట్లాడారు.అలాగే మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కార్యకర్తలే అంటూ కవితను కూడా కార్యకర్తలాగే చేసేశారు.. ఇక త్వరలోనే కవిత తెలంగాణ జాగృతి పేరు మీద లేకపోతే తెలంగాణ బహుజన పార్టీ అనే పేరు మీద కొత్త పార్టీ పెట్టబోతుందన్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 

అయితే సడన్ గా కవిత తన కొత్త పార్టీ వార్తలపై యూటర్న్ తిరిగినట్టు అయింది. ఎందుకంటే తాజాగా కేటీఆర్ కి అనుకూలంగా కవిత చేసిన పోస్ట్ ప్రస్తుతం రాజకీయాల్లో సంచలన సృష్టిస్తుంది.మరి ఇంతకీ కవిత కేటీఆర్ పై చేసిన ఆ పోస్ట్ ఏంటి..ఎందుకు మళ్ళీ స్వరం మార్చింది అనేది ఇప్పుడు చూద్దాం.. తాజాగా కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే తన అన్న కేటీఆర్ పై ఏసీబీ నోటీసులు పంపించడాన్ని తీవ్రంగా ఖండించింది కవిత.. ప్రజా సమస్యల నుండి దృష్టి మళ్లించడం కోసమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఏసీబీ నోటీసులు జారీ చేయిస్తుందని ట్వీట్ పెట్టింది.అంతేకాదు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులందరిదీ అంటూ పెట్టింది.

అయితే ఈ ట్వీట్ పై చాలామంది బీఆర్ఎస్ అభిమానులు సంబరపడిపోతున్నారు. కేటీఆర్ తో కవితకు విభేదాలు ఉన్నాయి అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తనపై ఏసీబీ నోటీసులు పంపించడాన్ని కవిత ఖండించడంతో వీరి మధ్య గొడవలు లేవు అని అనుకుంటున్నారు.ఇక మరికొంత మందేమో ఆ ట్వీట్ లో కేసీఆర్ సైనికులని  పెట్టింది కానీ తన అన్న కేటీఆర్ పేరు మాత్రం మెన్షన్ చేయలేదు అంటే ఆయన పేరుని పలకడానికి కూడా ఇష్టపడడం లేదనే కదా  అర్ధం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది అన్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం చేసిన ట్వీట్ మాత్రం రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: