
ఆన్ లైన్ లో సైతం విరాళాలు పంపేలా అవకాశం కల్పించినట్టు చంద్రబాబు కామెంట్లు చేశారు. అయితే మహానాడు జరుగుతున్న నేపథ్యంలో ఏపీలో సాక్షి, టీవీ9, ఎన్టీవీ ఛానెళ్ల ప్రసారాల విషయంలో ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. డీటీహెచ్ లు ఉన్నవాళ్లకు ప్రసారాల విషయంలో సమస్య లేకపోయినా కేబుల్ ఆపరేటర్ల ద్వారా సేవలు పొందుతున్న వాళ్లకు మాత్రం షాకులు తప్పడం లేదని తెలుస్తోంది.
మహానాడుకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసే ఛాన్స్ ఉందని ఈ మూడు ఛానెళ్లపై దృష్టి పెట్టారని భోగట్టా. అయితే సాక్షి ఎప్పుడూ కూటమికి వ్యతిరేకంగా అడుగులు వేస్తుంది కానీ టీవీ9, ఎన్టీవీ రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత మారాయి. ఆ ఛానెళ్లపై కక్షతో వ్యవహరించడం కరెక్ట్ కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి టీవీ రేటింగ్ అంతంత మాత్రంగా ఉండగా ఈ నిర్ణయాల ద్వారా మూలిగే నక్కపై తాటికాయ పడ్డ పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు.
రాబోయే రోజుల్లో సైతం సాక్షి ఛానెల్ పుంజుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొన్ని ఛానెళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏపీలో మీడియా ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఏ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీ ఛానెళ్లు ప్రచారం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఛానెళ్ల విషయంలో ఏపీ సర్కార్ తీరు ఎలా ఉంటుందో చూడాలి. ఈ ఛానెళ్ల ప్రసారాల నిలుపుదలపై ఛానెళ్ల యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.