క‌డ‌ప మ‌హానాడు వేదిక‌గా లోకేష్ ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. వైసీపీపై తీవ్ర స్తాయిలో విరుచుకు ప‌డ్డారు. మహిళలను గౌరవించి గొప్పనేల కడప. కడప మాస్ జాతర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు సైన్యం గర్జించింది, దేవుని గడప కడపలో పసుపు పండగ జరుపుకోవడం మన అదృష్టం. 2024లో మాస్ విక్టరీ సాధించాం, రికార్డులు బద్దలు కొట్టాం... చరిత్రను తిరగరాసాం.  94 పర్సెంట్ స్ట్రైక్ రేట్...164 అవుటాఫ్ 175. ఇది కేవలం రికార్డ్ కాదు ఆల్ టైం రికార్డ్. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటుదెబ్బ.  జెండా పీకేస్తాం అన్నారు ... పార్టీ కార్యాలయానికి టు లెట్ బోర్డు పెట్టుకున్నారు. పార్టీ లేకుండా చేస్తామన్నోళ్లు అడ్రెస్స్ లేకుండా పోయారు.  వై నాట్ 175 అన్నారు ... ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేసారు... ఎన్నికల్లో ప్రజలు ఫుట్ బాల్ ఆడుకున్నారు. ఏ తప్పు చేయని మన అధినేతను అరెస్ట్ చేసారు... ప్రజలు వాళ్ళ నాయకుడిని ప్యాలస్ లో పెట్టి తాళం వేసార‌ని ఎద్దేవా చేశారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, గౌరవ మంత్రులు, గౌరవ ఎమ్మెల్యేలు, 82 బ్యాచ్ సీనియర్ నాయకుల దగ్గర నుండి 2025 బ్యాచ్ జూనియర్లకు, ప్రజలకు, అందరి కంటే ముఖ్యం, ఎత్తిన జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్నప్రాణసమానమైన కార్యకర్తలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాన‌ని లోకేష్ తెలిపారు.


దేవుని గడప సాక్షిగా ప్రజలకు 4ప్రశ్నలు :
దేవునికడప సాక్షిగా ఇక్కడి ప్రజలను నాలుగు ప్రశ్నలను అడగాలనుకుంటున్నా. 1). తల్లిని చెల్లిన మెడబట్టి బయటకు గెంటిదెవరు? 2). సొంత బాబాయిని గొడ్డలిపోటుతో లేపేసిందెవరు? 3). జె-బ్రాండ్స్ తో పేదల రక్తం తాగిందెవరు? 4). బల్లకింద రెడ్ బటన్ నొక్కి ప్రజలను బాదిందెవరు ?   అని లోకేష్ ప్ర‌శ్న‌లు సంధించారు.  మహానాడులో ఏకగ్రీవంగా ఆమోదించిన ఆరుశాసనాలను పొలిట్ బ్యూరో సభ్యుడి నుంచి సామాన్య కార్యకర్త వరకు శ్వాసగా భావించి చిత్తశుద్ధితో అమలుకు కృషిచేయాల‌న్నారు. తెలుగు వారిని ప్రపంచ పటంలో పెట్టింది మన బ్రాండ్ సిబిఎన్. అప్పుడు ఐటీ ఇప్పుడు ఏఐ. అప్పుడు హైటెక్ సిటీ ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ. అప్పుడు సైబరాబాద్ ఇప్పుడు అమరావతి. అప్పుడు రూ.200 పెన్షన్ ను రూ. రెండు వేలు చేసింది మన సిబిఎన్...ఇప్పుడు పెన్షన్ ను  రూ.నాలుగు వేలు చేసింది మన సిబిఎన్. అన్న క్యాంటిన్లు, డ్వాక్రా, దీపం, పేదల చిరునవ్వు మన సిబిఎన్. సిబిఎన్ అంటే డెవెలప్మెంట్, సిబిఎన్ అంటే సంక్షేమం, సిబిఎన్ అంటే మానవత్వం. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు ట్రెండ్ సెట్ చేస్తారు.  సినిమా స్క్రీన్ అయినా పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయనే లెజెండ్. ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు ఒక ప్రభంజనం.  ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే భీముడు, ఆయనే అర్జునుడు, ఆయనే కర్ణుడు, ఆయనే ప్రజల గుండెల్లో దేవుడు అని లోకేష్ కొనియాడారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: