
కవిత తన లేఖలో గతంలో 150 వార్డులకు వేర్వేరుగా టెండర్లు పిలిచేవారని, ఇప్పుడు తొమ్మిది జోన్ల వారీగా టెండర్లు పిలవడం వల్ల స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశాలు తగ్గాయని విమర్శించారు. విదేశీ సంస్థ వాహనాలను తప్పనిసరిగా ఉపయోగించాలన్న నిబంధన ఒక నిర్దిష్ట సంస్థ, రెండు ఏజెన్సీలకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందిందని ఆమె ఆరోపించారు. ఈ నిబంధనలు స్థానిక కాంట్రాక్టర్లను దూరం చేసి, వారి ఆర్థిక స్థితిని దెబ్బతీస్తున్నాయని కవిత ఆందోళన వ్యక్తం చేశారు.
జీహెచ్ఎంసీ టెండర్లలో అవకతవకలు ఉన్నాయని, ఇది తెలంగాణ కాంట్రాక్టర్లకు అన్యాయం చేస్తోందని కవిత తన లేఖలో స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో కేవలం రెండు షోరూమ్‌లు ఉన్న విదేశీ సంస్థతో ఒప్పందాలు చేసుకోవడానికి స్థానిక కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారని, కర్ణాటక షోరూమ్‌ల నుంచి ఒప్పందాలు తెచ్చుకున్న వారిని కూడా అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆమె వెల్లడించారు. ఈ పరిస్థితి స్థానిక వ్యాపారులకు అవకాశాలను కోల్పోయేలా చేస్తోందని ఆమె ఆరోపించారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు