కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఉపాధి హామీ పథకం కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ పథకం ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఈ స్కీమ్ కోట్ల సంఖ్యలో ప్రజల తలరాతలను మార్చిన స్కీమ్ కాగా పీఎం నరేంద్ర మోదీ నిర్ణయం ఏపీలోని ఉపాధి హామీ కూలీలకు మరింత మేలు చేయనుందని సమాచారం అందుతోంది.
 
ఉపాధి హామీ పథకం ద్వారా పని లేని వాళ్లకు పని కల్పిస్తున్నారు. ఏడాదికి 100 రోజుల పాటు కనీసం పని కల్పించేలా ఈ స్కీమ్ అమలవుతోంది. అయితే ఏపీలో ఉపాధి హామీ కార్యక్రమాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తానని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ వెల్లడించడం జరిగింది. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ ఆలోచన ఒకింత అద్భుతమైన ఆలోచన అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
 
రైతులకు ఉపాధి హామీ కూలీలను అటాచ్ చేయడం వల్ల ప్రస్తుతం ఖర్చు చేస్తున్న మొత్తంతో పోల్చి చూస్తే రైతులపై భారం తగ్గే ఛాన్స్ అయితే ఉంది. రైతు కూలీలు ప్రస్తుతం రైతులకు ఒక విధంగా భరించలేని భారంగా మారాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే రైతులు పెట్టుబడులు పెట్టిన స్థాయిలో లాభాలు అయితే దక్కడం లేదని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ విధంగా జరగడం వల్ల రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.
 
మోదీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకంగా 1136 కోట్ల రూపాయలు కేటాయించడం గమనార్హం. మెటీరియల్ కాంపోనెంట్ కోసమే ఏకంగా 960 కోట్ల రూపాయలు కేటాయించగా పరిపాలనా ఖర్చుల కోసం 176 కోట్ల రూపాయలు కేటాయించడం గమనార్హం. భారీ మొత్తంలో నిధులు కేటాయించిన నేపథ్యంలో చంద్రబాబు, పవన్ ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: