
ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళలకు నెలకు 1500 వంతున ఏడాదికి 18 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటులు చేస్తుంది . ఇక ఇప్పటికే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం మొదలు పెడతామని ప్రకటించిన ప్రభుత్వం .. అంతకుముందే ఆడబిడ్డ నీది పథకం అమలు చేయబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి . నెలకు 1500 చొప్పున ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకం కోసం దరఖాస్తులు ఆన్లైన్లో తీసుకునేందుకు వీలుగా వెబ్సైట్ ను రేడీ చేస్తున్నట్టు తెలుస్తుంది .. అలాగే ఈ పథకం అమలు కోసం 3000 కోట్లకు పైగా నిధులు కూడా సమకూర్చుకుంటున్నారు .. ఈ ప్రక్రియ పూర్తి అవగానే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది .
అయితే నిజానికి ఆటబిడ్డ నీధి పథకం అమలు కోసం ఈ ఏడాది బడ్జెట్లో కూటమీ ప్రభుత్వం 3300 కోట్లు నిధులు కూడా కేటాయించింది . ఇక ఈ నిధులతో బీసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు సుమారు 1000 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు . అలాగే అధికంగా వెనకబడిన మహిళలకు మరో 630 కోట్లు , మైనార్టీ మహిళల కోసం 84 కోట్లు , ఎస్సీ ఎస్టీ వర్గాల ఆడబిడ్డల కోసం మిగిలిన నిధులు ఉపయోగించబోతున్నట్లు ప్రకటించారు .. ఇక దీంతో ఈ కీలక పథకం అమలు కోసం ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.