మేఘాలయాలో జరిగిన రాజా రఘువంశీ మర్డర్ కేసు ఒకింత సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో ఏ విధంగా మలుపులు ఉంటాయో ఈ హత్య కేసులో సైతం అదే విధంగా మలుపులు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ మర్డర్ కేసులో వెలుగులోకి వచ్చిన విషయాలపై సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. ఇండోర్ కు చెందిన సోనమ్, రాజా రఘువంశీ పెళ్లి చేసుకోగా హనీమూన్ కోసం ఈ జంట వెళ్లగా మే 23వ తేదీ తర్వాత రాజా రఘువంశీ కనిపించలేదు.

జూన్ నెల 2వ తేదీన లోయలో రాజా రఘువంశీ  మృతదేహాన్ని కనుగొనడం జరిగింది.  ఆ తర్వాత సోనమ్ తో పాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.  సోనమ్, మిగతా నిందితులు ఇప్పటికే హత్యను అంగీకరించారు. తాజాగా సీన్ రీ కన్  స్ట్రక్షన్ కూడా పూర్తయింది.  ఇందుకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.   సోనమ్ రాజ్ కుశ్వాహ్ అనే  వ్యక్తితో  సంబంధం కలిగి ఉండటం వల్ల భర్తను వదిలించుకుందని తెలుస్తోంది.

అయితే ఆమె మనసులో  సంజయ్ వర్మ అనే  మరో వ్యక్తి కూడా ఉన్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.  మార్చ్  నెలలో సోనమ్  సంజయ్ వర్మతో ఏకంగా 119 కాల్స్ మాట్లాడిందని భోగట్టా.  ప్రస్తుతం సంజయ్ వర్మ  ఫోన్ స్విచాఫ్ లో ఉంది. అయితే ఈ హత్య కేసుతో సంజయ్ వర్మకు నిజంగానే సంబంధం ఉందా? లేదా? అనే  ప్రశ్నకు జవాబు  తెలియాల్సి ఉంది.  సోనమ్ కు క్షుద్ర పూజలు,  తంత్రాలు వచ్చని  రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

పెళ్లి తర్వాత సోనమ్ తండ్రి తమ ఇంటి గుమ్మానికి ఏదో  వేలాడదీశారని  అడిగితే  సెంటిమెంట్ అని చెప్పారని  రాజా రఘువంశీ తండ్రి పేర్కొన్నారు.  నా కొడుకు మరణం అనంతరం గుమ్మానికి కట్టిన  విచిత్ర వస్తువును ఎవరో తొలగించారని  ఆయన  కామెంట్లు చేశారు.  క్షుద్ర పూజల్లో భాగంగా  రాజా రఘువంశీ హత్య జరిగిందనే ప్రచారం సైతం జరుగుతోంది.  ఈ కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలు  వెలుగులోకి వస్తాయేమో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: