ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం ఎవరిదైనా కూడా కచ్చితంగా ఫిర్యాదులకు సంబంధించి ఏవో ఒక విషయంలో వినిపిస్తూ ఉంటాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించి 70 నుంచి 80% వరకు ఫిర్యాదులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వం వెల్లడిస్తోంది. రాబోయే ఏడాది కాలంలో అధికారులను మరింత అంకిత భావంతో పనిచేసేలా చూస్తామని రెవెన్యూ రికార్డులు అన్నిటిని కూడా సరి చేస్తామంటూ సీఎం చంద్రబాబు కూడా వెల్లడించారు. అయితే వాటిని భవిష్యత్తులో ఎవరు టాంపరింగ్ చేయడానికి వీలు లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీతో కట్టుదిద్ధం చేస్తామంటూ వెల్లడించారు చంద్రబాబు.


వెనుకబడిన నియోజకవర్గాలకు వచ్చే పెట్టుబడులకు సంబంధించి అన్ని రాయితీలు, ప్రోత్సాహాలు కూడా ఉంటాయి అంటూ వెల్లడించారు. 2027 జూన్ లేదా డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును సైతం పూర్తి చేస్తామని వెల్లడించారు. పోలవరం ప్రధాన ఎడమ కాలువను ఈ ఏడాది పూర్తి చేస్తామని.. అనకాపల్లి వరకు నీటిని విడుదల చేస్తామంటూ తెలియజేశారు సీఎం చంద్రబాబు. పోలవరం-బనకచర్ల  కీ అనుసంధానంగా ఉన్న ప్రాజెక్టు రాయలసీమకు చాలా కీలకమవుతుందని తెలిపారు.. అయితే ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఉపయోగముందే తప్ప నష్టం ఎలాంటిది లేదని తెలిపారు


ఆ నీటిని తెలంగాణ కూడా ఉపయోగించుకోవచ్చు అని గోదావరి జలాలని సమానంగా ఉపయోగించుకునే అవకాశం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉన్నదంటూ తెలిపారు. ప్రతి ఏడాది గోదావరి నుంచి మూడు టీఎంసీల జలాలు సముద్రంలోకి వెళ్లిపోతున్నాయి.. ఇందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎంత వాడుకున్న కూడా 200 టీఎంసీలు మించి ఉండదంటూ తెలిపారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన కొనసాగించి ఏడాది సందర్భంగా నిన్నటి రోజున అమరావతిలో రాష్ట్ర సచివాలయంలో సుపరిపాలనతో తొలి అడుగు అని పేరుతో టిడిపి ,జనసేన ,బిజెపి పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ తెలియజేశారు. మొదటి సంవత్సరం అద్భుతంగా పనిచేశామని.. వచ్చే సంవత్సరం నాటికి మరో 15% వృద్ధిరేటు సాధించి 2,47లో స్వర్ణాంధ్ర విజన్ సాధ్యమని నిరూపిస్తామంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: