
కేశినేని నాని విజయవాడ ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా 2014 - 2019 ఎన్నికలలో విజయం సాధించారు. 2014లో తొలిసారి పార్లమెంటుకి పోటీ చేసి ఎంపీగా గెలిచిన నాని 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ జగన్ ప్రభంజనం వీచినా కూడా ఆ ఎదురుగాలి తట్టుకునే మరి విజయవాడ ఎంపీగా వరుసగా రెండోసారి విజయం సాధించారు. నాని రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో మరియు ముఖ్యంగా లోకేష్ తో బాగా గ్యాప్ వచ్చేసింది. ఈ క్రమంలోనే గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికలలో లోకేష్ నానిని పక్కనపెట్టి నాని సోదరుడు కేశినేని శివనాథ్ ( చిన్ని ) కి విజయవాడ పార్లమెంట్ సీటు కేటాయించారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు నాని వైసీపీ కండువా కప్పుకుని తన సొంత సోదరుడి మీద వైసిపి తరఫున పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఏడాది కాలంలో ఎంపీగా గెలిచిన కేశినేని చిన్ని ఏ మేరకు పని చేశారు ? ఎలా ముందుకు సాగారు అన్నది తెలియాలంటే చిన్ని సోదరుడు నాని 10 ఏళ్లలో విజయవాడ ఎంపీగా ఎలా పనిచేశారు అన్న పనులతో పోల్చుకోవాల్సి ఉంటుంది.
నాని నియోజకవర్గంలో నిత్యం అందుబాటులో ఉండటం .. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో టాటా ట్రస్ట్ ద్వారా అనేక పనులు చేయించడం.. బెంజ్ సర్కిల్ దుర్గగుడి ఫ్లైఓవర్ గొల్లపూడి రహదారుల విస్తరణ వంటి పనులు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాలకు జలజీవన్ మిషన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాలలో నాని అంటే ఒక బ్రాండ్ పార్టీలకు అతీతంగా మంచి ఇమేజ్ ఏర్పడింది. వీటితో పోల్చి చూసినప్పుడు నాని సోదరుడుగా కేశినేని చిన్ని కూడా దాదాపు అన్నను మరిపించేలా తమ్ముడు వ్యవహరిస్తున్నారు అనేది పరిశీలకులు చెబుతున్న మాట. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేసే దిశగా ఎంపీ చిన్ని అడుగులు వేస్తున్నారు.
ఇటీవల నిర్వహించిన యోగేంద్ర కార్యక్రమంలో ఆయన విజయవాడ భవానిపురంలో కృష్ణా నది వద్ద ఫ్లోటింగ్ యోగ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు దక్కించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కనుసన్నల్లో పడ్డారు. మైలవరం - నందిగామ - తిరువూరు లాంటి నియోజకవర్గాలలో గ్రామీణ ప్రాంతాలలో గతంలో తన అన్న చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించి వాటిని పూర్తి చేస్తున్నారు. ఇక కేంద్ర మంత్రులను కలవడం రాష్ట్రానికి సంబంధించిన అంశాలలో చర్చించడం ఇవన్నీ చూస్తుంటే చిన్ని కూడా తన అన్న నానీలా మంచి పేరు తెచ్చుకునేందుకు తాపత్రయపడుతున్నారు అని అర్థమవుతుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు