
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు వైసీపీలో ఉన్న రఘురామ అప్పట్లో అధికార పార్టీ ఎంపీగా ఉండి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అప్పుడు ఆయన మీడియాలో చేసిన రచ్చ అంతా కాదు .. ఫలితంగా వైసిపి ఇమేజ్ చాలా వరకు డ్యామేజ్ అయింది. ఈ క్రమంలోనే రఘురామను బిజెపిలో చేర్చుకుని ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ నిరాకరించడంతో ఆయనను టిడిపిలోకి తీసుకుని అసెంబ్లీ సీట్లు ఇవ్వడంతో భారీ మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రఘురామకు ప్రతిపక్ష వైసిపి కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. తాజాగా కూటమి ప్రభుత్వం పై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రతిపక్షానికి ఆయుధంగా మారాయి. చిన్న విషయమైనా దానిని రఘురామ పెద్దదిగా చేసి చూపటం విమర్శలు గుర్తించడం .. అందునా ప్రభుత్వ పెద్దలు అంటూ కామెంట్ చేయడం వంటివి రాజకీయంగా కూటమిని ఇరుకున పెట్టాయి.
ఇది ప్రతిపక్షానికి చాలా అనుకూలంగా మారింది. ఇటీవల తొలి అడుగు పేరుతో కూటమి ప్రభుత్వం ఒక కార్యక్రమం నిర్వహించింది. దీనిలో ప్రోటోకాల్ పాటించలేదు అని రఘురామ ప్రధాన ఆరోపణ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రోటోకాల్ అన్నది మంచిదే అయినా .. అది ప్రజల ఓటు బ్యాంకు పోయే అవకాశం ఉన్న అంశం కాదు. జరిగిన పొరపాటున సరిదిద్దుకునే రఘురామ సూచనలు , సలహాలు చేయకుండా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం చంద్రబాబుకు నచ్చలేదట. అందుకే ఆయన రఘురామకు సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు