రాజకీయాలలో కొంతమంది నేతలు చెప్పిన మాటలు నేతలను అంతర్గతంగా ఇబ్బందులలోకి పడేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎలాంటి వేదికలైనా సరే కొన్ని విషయాలను మొహమాటం లేకుండా కొంత మంది నేతలు చెబుతూ ఉంటారు. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉన్నా సరే వారు పట్టించుకోరు. ఇలాంటి లిస్టులో రాజ్యసభ సభ్యురాలు గారపాటి రేణుక చౌదరి కూడా ఒకరు.. ఏ విషయం అయినా సరే మొహమాటం లేకుండా పైకి చెప్పేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పైన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి.


తెలంగాణ రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన రేణుక చౌదరి గతంలో ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి గెలిచి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు .కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగానే పేరు సంపాదించింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మంచి సన్నిహితులని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్  ప్రభుత్వం ఉన్నప్పటికీ కొన్ని కారణాల చేత ఈమెకు ప్రాధాన్యత తగ్గిపోయిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఒక మీడియా ఛానల్లో పలు రకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది.


జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏపీ నాశనం అయ్యిందని.. అమరావతి లేకుండా చేశారని విధంగా ఫైర్ అయ్యింది. కాని ఇప్పుడు తాజాగా రేణుక చౌదరి ఏపీ సీఎం చంద్రబాబు పనితీరుపైన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.. ప్రస్తుతం సీఎం చంద్రబాబు పనితీరు చెప్పుకోదగ్గగా లేదని గ్రాఫ్ చాలా డౌన్ అయిపోయిందంటూ తెలియజేసింది. ఊహించిన విధంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేయడం లేదు అన్నట్లుగా ఆమె వెల్లడించింది. కూటమి ప్రభుత్వం పని కూడా అయిపోయిందని చెప్పడమే కాకుండా..తన సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు ఇలా మాట్లాడడంతో కూటమినేతలు  అందరూ ఆశ్చర్యపోతున్నారు.ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: