ఇండియాలో అత్యధిక జీతాలు అందుకుంటున్న ఐటీ ఉద్యోగులపై ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుంది .. ఇక దీంతో వారానికి 70 ప‌ని గంటలకు పరిమితం చేయాలన్న డిమాండ్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి .. ఇక గతంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వారానికి 70 పని గంటలు మాత్రమే ఉండాలన్న డిమాండ్ ను తెరపైకి తెచ్చారు .. రోజుకు 9.15 గంటలు చొప్పున వారానికి 70 గంట‌లు మాత్రమే పని చేయాలన్నది ఆయన ఆలోచన .. అయితే ఈ ఆలోచన ఆయన సొంత కంపెనీ ఇన్ఫోసిస్ ఉద్యోగులే పట్టించుకోవడం లేదు.
 

ఇక దీంతో ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఇకపై వారు చేసే పని గంటలు దాటిన ఎక్కువ సమయం డ్యూటీలో ఉంటే వార్నింగ్ ఈ మెయిల్స్ పంపాలని హెచ్ఆర్ టీం నిర్ణయం తీసుకుంది .. ఈ మేర‌కు ఇప్పటికే ఉద్యోగులందరికీ ఈమెయిల్ కూడా పంపింది .. ప్రధానంగా వారానికి 70 పని గంటలు మాత్రమే ఉండాలని , వారాంతంలో రెండు రోజులు సెలవులు ఇవ్వాలన్న నారాయణమూర్తి ఆలోచన ప్రకారం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకువచ్చింది .. అలాగే నారాయణమూర్తి ఆలోచనకు భిన్నంగా ఎవరు ఎక్కువ గంటలు పనిచేస్తున్న ఉద్యోగులకు ఆటోమేటిక్గా రోజుకు 9.15 గంటలు దాటితే మార్నింగ్ మెయిల్ పంపేలా ఒక వ్యవస్థను కూడా సిద్ధం చేశారు.

 

అయితే ఇక్కడ నిజానికి ఇన్ఫోసిస్ ఆఫీసుల్లో కాకుండా ఇంటి వద్ద నుంచి రిమోట్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇలా నిర్ణీత సమయం 9.15 గంటలకు కంటే అధిక సమయం వర్క్ చేస్తున్నట్లు హెచ్ఆర్ వర్గాలు చెబుతున్నాయి . అలాగే వీరికి నెలవారి పని గంటలు లెక్క ఉంటుంది కాబట్టి ఈ లక్ష్యాన్ని అందుకునేందుకు ఇలా కొన్ని రోజులు ఎక్కువ గంటలు పనిచేస్తున్నట్లు కూడా చెబుతున్నారు .. అలాగే దీని కారణంగా వారికి అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు కూడా వారు గుర్తించారు .. ఈ క్రమంలోని ఇన్ఫోసిస్ వారికి ఇలా వార్నింగ్ మెయిల్స్ పంపి వారిని అలెర్ట్ చేయాలని నిర్ణయించుకుంది .. అలాగే ఈ నిర్ణయ ప్రభావం దాదాపు 3. 23 లక్షల మంది ఉద్యోగులపై ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు.

 

వారు చేసే పని పట్ల నిబద్దతను తాము ఎంతగానో గౌరవిస్తున్నామని .  అయితే వృత్తి జీవితానికి , వ్యక్తిగత జీవితానికి మధ్య ఉండాల్సిన సమతుల్యం దెబ్బతినకుండా ఉంటే ఎక్కువ కాలం పని చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు హెచ్ఆర్ ఉద్యోగులు పంపిస్తున్న మెయిల్స్ లో మ్యాటర్ చెబుతోంది .. ఇండియన్ ఐటి రంగంలో ప్రధానంగా ఉద్యోగుల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న క్రమంలో ఇన్ఫోసిస్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మంచిద‌న భావన అందరిలో వ్యక్తం అవుతుంది . మరి రాబోయే రోజుల్లో మరికొన్ని సంస్థలు కూడా ఇన్ఫోసిస్ రూట్లో వస్తాయని కూడా అంటున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: