సాధారణంగా ఏదైనా ఆహ్లాదకరమైన అందాలను చూడడానికి తరచు చాలామంది ప్రజలు విహారయాత్రలకు వెళుతూ ఉంటారు. అలా కొన్ని సందర్భాలలో కొన్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి.. తాజాగా వాతావరణం అనుకూలించక టూరిస్టులు ప్రయాణిస్తున్న ఒక పడవ నదిలో మునిగి ఏకంగా 34 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ పర్యటనలో సుమారుగా 20 మంది చిన్నారులే ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మరొక 8మంది గల్లంతయినట్టుగా సమాచారం. వీటిలో మరో పదకొండు మందిని అక్కడ సహాయ బృందాలు రక్షించాయి.


పూర్తి వివరాల్లోకి వెళితే వియత్నంలో హాలోంగ్ బే లో    ఈ ఘోర ప్రమాదం జరిగింది.. ప్రయాణిస్తున్న టూరిస్టుల పడవ ఒక్కసారిగా ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అయితే మృతులలో ఎక్కువ మంది చిన్నారులు ఉండడంతో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఈ పడవ ప్రయాణం. పడవ ప్రారంభమైన కొన్ని నిమిషాలలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా అక్కడ మీడియా సంస్థలు తెలియజేస్తున్నాయి.. ఇందులో 48 మంది టూరిస్టులు ఉన్నారని అలాగే 5 మంది ఆపరేటర్లు కూడా ప్రయాణించారట.


పడవ ప్రయాణిస్తున్న  సమయంలో ఎక్కువగా బలమైన గాలులతో పాటుగా భారీ వర్షం పడడంతో వాతావరణం పడవకు అనుకూలించగా ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం రెస్క్యూ బృందాలకు అందగా వెంటనే వారు రంగంలోకి దిగి మరి నాలుగు గంటల పాటు శ్రమించి కొంతమందిని కాపాడారు. అయితే గల్లంతైన వారికోసం మరింత గాలింపు చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ ఘటన జరిగిందని ప్రధానమంత్రి ఫామ్ మిన్ చిన్ తెలియగానే మృతుల కుటుంబాలకు సైతం సంతాపం తెలిపారు. అలాగే గల్లంతైన వారిని కూడా రక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని సహాయ బృందాలను కూడా కోరడం జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణాలను కూడా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: