
కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు రైతుల ఖాతాలలో ఆగస్టు నెల 2వ తేదీన జమ కానున్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు నిధుల బదిలీకి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. లబ్ధిదారులైన రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమ చేయబడుతుందని సమాచారం అందుతోంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే రైతులు తమ బ్యాంకు ఖాతాలను యాక్టివ్ గా ఉండేలా చూసుకోవాలి.
అన్నదాత సుఖీభవ వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏమైనా సమస్యలు తలెత్తితే సంబంధిత వ్యవసాయ కార్యాలయాలను లేదా గ్రామ సచివాలయాలను సంప్రదించడం ద్వారా సమస్యలను నివృత్తి చేసుకోవచ్చు. ఆగస్టు 2న నిధుల జమతో, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర రైతాంగానికి మరోసారి అండగా నిలిచినట్లవుతుందని చెప్పవచ్చు.
గతేడాది ఏపీ సర్కార్ ఆర్ధిక కారణాల వల్ల ఈ పథకాన్ని అమలు చేయలేదు. ఈ పథకం అమలు రైతులలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని, సాగు పనులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. రైతులకు పెట్టుబడి ఖర్చులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అండగా నిలిస్తే రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుంది. అన్నదాత సుఖీభవ వెబ్ సైట్ ద్వారా ఈ పథకానికి అర్హత ఉందో లేదో తెలుసుకోవచ్చు