( విజ‌య‌వాడ‌ - ఇండియా హెరాల్డ్ )

ఉమ్మ‌డి ప్రకాశం జిల్లా రాజకీయాల పరంగా చూస్తే, ఒంగోలు నియోజకవర్గంలో రాజ‌కీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి, మాజీ వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ నేత.. ప్ర‌స్తుత ఎమ్మెల్యేఏ దామచర్ల జనార్దన్ మధ్య రాజకీయ పోరు మరింత ఉత్కంఠను సృష్టిస్తోంది. 2019లో వైసీపీ తరఫున ఒంగోలు నుంచి గెలిచిన బాలినేని, జగన్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా పని చేశారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన ఓటమి అనంతరం ఆయన పార్టీ మారారు. జనసేనలో చేరి త‌న కొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. టీడీపీ - జనసేన కూటమిలో ఉండి కూడా దామ‌చ‌ర్ల‌ను ఇబ్బంది పెట్టేలా వెళుతున్నట్టుగా ఉంది. ఆయ‌న త‌న సమావేశాల్లో టీడీపీ జెండాను వాడకపోవడం, పరోక్షంగా త‌న వర్గానికే ప్రాధాన్యం ఇచ్చేలా వ్యవహరించడం ఒంగోలు రాజకీయాలలో క‌ల‌కలం రేపుతోంది.


పవన్ కళ్యాణ్ ఒంగోలు జిల్లాలో పర్యటించి, బాలినేని విషయంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడి మరింత పెంచాయి. "బాలినేని అంటే నాకు ప్రత్యేక అనుబంధం ఉంది" అని పవన్ చెప్పడం ద్వారా బాలినేని మ‌రింత దూకుడుగా వెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన తరఫున ఒంగోలు నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించారు.
ఈ ప్రకటనలు టీడీపీ నేత దామచర్ల జనార్దన్‌కు అసహనం కలిగించాయి. అప్పటి నుంచి ఆయన బాలినేనిపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా "హరిహర వీరమల్లు" సినిమా ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదమయ్యాయి. పవన్, బాలినేని ఫొటోలు మాత్రమే ఉండగా, చంద్రబాబు చిత్రపటానికి చోటు లేకపోవడం టీడీపీ వర్గాల్లో ఆగ్రహం రేపింది. ఈ ఫ్లెక్సీలను మునిసిపల్ అధికారులు తొలగించడం, ఆ తర్వాత బాలినేని వర్గీయులు దామచర్లపై బహిరంగంగా విమర్శలు చేయడం, ఈ పరిణామాలను మరింత పెంచేసింది. దాంతో దామచర్ల ఈ విషయాన్ని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లడం, రాజకీయంగా తీవ్రతను తాకింది.


ప్రస్తుతం ఒంగోలు రాజకీయాలు నివురు గ‌ప్పిన నిప్పులా ఉన్నాయి. బాలినేని, దామచర్ల మధ్య ఎదురు దాడులు, మాటల తూటాలు పేలుతున్నాయి. ఫైన‌ల్‌గా ఒకేవ‌ర‌లో రెండు క‌త్తులు ఇమ‌డ‌లేన‌ట్టుగా ఒంగోలు నుంచి ఎవ‌రు అవుట్ అవుతారు.. ఎవ‌రు ఇక్క‌డ ఉంటారు ? అన్న ప్ర‌శ్న‌లకు ఆన్స‌ర్ తెలియాలంటే వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: