
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పీవీఎన్ మాధవ్ చురుకైన రాజకీయ నాయకుడిగా పేరొందినా ఆయన వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "కాపురానికి వచ్చిన కొత్తలాగే" వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు ప్రస్తుతం బీజేపీలో ఇంటర్నల్‌గా చర్చకు వస్తున్నాయి. ఆయన బాధ్యతలు చేపట్టిన పదిరోజులకే అసంతృప్తి వెల్లువెత్తుతోంది. ఇంతకుముందు రాష్ట్ర బీజేపీ బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలకు ఆర్ ఎస్ ఎస్ తో అనుబంధం లేకపోయినా వారు అన్ని వర్గాల నాయకులను కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. వారి పాలనలో విభేదాలు తక్కువగా ఉండేవి. వారు మరీ పెద్ద వ్యతిరేకత ఎదుర్కోలేదు. అయితే పీవీఎన్ మాధవ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే, పార్టీ నాయకుల్లోని ఓ వర్గం అసంతృప్తిని వ్యక్తం చేయడం మొదలు పెట్టింది. మాధవ్ ఆర్ ఎస్ ఎస్ బ్యాక్‌గ్రౌండ్‌కు చెందిన నేతలనే ప్రాధాన్యం ఇవ్వడం, ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలతో సంబంధాలు పెట్టుకోవడంలో ఆసక్తి చూపకపోవడం ఈ విమర్శలకు కారణమవుతోంది.
ప్రస్తుతం మాధవ్‌ను కలవాలనుకుంటున్న అనేక మంది నేతలకు అవకాశమే ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది. కేవలం తనకు నచ్చిన వ్యక్తులకే కలిసే అవకాశం ఇస్తుండడంతో పార్టీలో అంతర్గతంగా విభేదాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన కొంతమంది కీలక నేతలు, ఇప్పటికే ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మేం ఆర్ ఎస్ ఎస్ నుంచి రాలేదు.. అందుకే మమ్మల్ని తక్కువచూపడమా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇది రాష్ట్రంలో బీజేపీ కూటమి భాగస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాధవ్ కడప పర్యటనలో కేవలం మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను మాత్రమే ప్రస్తావిస్తూ రాష్ట్ర కూటమి సర్కారుపై ప్రస్తావన లేకుండా సాగుతోంది. ఇది జనసేన, టీడీపీ వర్గాల్లో అసంతృప్తికి దారితీస్తోంది. మరి మాధవ్ ఇలాగే వెళితే కూటమిలో చిక్కులు తప్పవు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు