- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )
 
తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఏమయ్యారు ? అన్న ప్రశ్న ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల‌లో వినిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు రాజకీయంగా ఆయన స్లో అయ్యారు. గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన జయదేవ్ గత ఎన్నికలలో స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారు. 2019లో వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచిన ఆయన నాడు అమరావతి ఉద్యమంలో అసలు కనిపించలేదు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు క్రియాశీలకంగా లేరు. అలాగే ఢిల్లీలో కూడా రెండోసారి ఎంపీగా గెలిచినప్పుడు ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయలేదు అన్న అసంతృప్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు జయదేవ్ ప్రకటించారు. గల్లా జయదేవ్ స్థానంలో పెమ్మ‌సాని చంద్రశేఖర్ తెరమీదకు వచ్చారు.


ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో జయదేవ్ చంద్రబాబు - లొకేష్ ను కలిశారు. అయితే ఇప్పుడు జయదేవ్ కు ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఆయన పూర్తి సైలెంట్ గా ఉన్నారు. తల్లి గల్లా అరుణ రాజకీయ వారసుడిగా జయదేవ్ గుంటూరు నుంచి టిడిపి తరఫున ప్రస్థానం మొదలుపెట్టారు .అయితే జయదేవ్ అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం నడిపిస్తున్నారు. దీంతో గల్ల కుటుంబానికి రాజకీయాల కంటే పరిశ్రమలను కాపాడుకోవడం ముఖ్యమైంది. మారిన రాజకీయ పరిస్థితులలో ఇబ్బంది పడటం ఎందుకని ఆలోచనతో గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆయన మళ్లీ రాజకీయంగా యాక్టివ్ కావాలని అనుకున్న ఇక్కడ ఆయనకు స్పేస్ అయితే కనిపించడం లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: