ఆంధ్రప్రదేశ్ పిసీసీకి కొత్త సారధి రాబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. 2024 ఎన్నికలలో జనవరిలో షర్మిలను ఏపీసీసీ చీఫ్ గా ఎంపిక చేయడం జరిగింది. 2021 లో తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ టిపి పార్టీని స్థాపించి 2023 చివరిలో కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసింది షర్మిల. దీని ఫలితంగానే ఆమెకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించారు. అయినా కూడా ఏమాత్రం కలిసి రాలేదు. కానీ టిడిపి పార్టీకి చాలా లబ్ధి చేకూరిందని వినిపిస్తూ ఉంటాయి. వైసీపీ ఓటు బ్యాంకును కూడా దెబ్బేసిందని చెప్పవచ్చు.


2024 జూన్ ఫలితాలలో టిడిపి పార్టీ కూటమిగా అధికారాన్ని చేపట్టింది. సుమారుగా 17 నెలల పాలన కొనసాగిస్తూ ఉంది కూటమి. ప్రస్తుతం ప్రతిపక్షంగా వైసిపి పార్టీ ఉన్నది. వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు షర్మిలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎంచుకోవడం కాంగ్రెస్ పార్టీకి సరైన నిర్ణయం అయినప్పటికీ.. కానీ వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా కేవలం వైసీపీ పార్టీని టార్గెట్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిపోతోంది తప్ప పెరగలేదట.


కాంగ్రెస్లో చాలామంది సీనియర్లు అందరూ కూడా  సైలెంట్ అయ్యారు.. ముఖ్యంగా షర్మిల కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి పని చేయలేకపోతోంది అంటూ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. చాలామంది సీనియర్లు కూడా షర్మిల పైన అసంతృప్తితో ఉన్నారని.. మార్చాలంటూ హై కమాండ్ కు కూడా డిమాండ్ చేస్తున్నారట. షర్మిల ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి చీఫ్ గా తప్పిస్తే.. ఈ స్థానాన్ని కేంద్ర మాజీ మంత్రి బీసీ నేత కిల్లి కృపారాణిని ఎంపిక చేయబోతున్నట్లు ప్రచారం అయితే జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన అయితే వెలబడలేదు.కృపారాణి ఎన్నో సేవా కార్యక్రమాలను చేసింది కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా మంచి స్నేహబంధం ఉన్నదట. 2003లో వైయస్సార్ పాదయాత్ర నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నదట. 2019లో వైసీపీ పార్టీలో చేరిన.. గెలిచిన తర్వాత వైసిపిలో ఎలాంటి పదవులు దక్కకపోవడంతో మళ్లీ 2024లో కాంగ్రెస్ పార్టీ లోకి చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: