పులివెందులలో రాజకీయంగా హీటెక్కింది. అనూహ్యంగా జడ్పీటీసీ సభ్యుడి మృతి తర్వాత ఖాళీ అయిన స్థానానికి ఉపఎన్నిక తలెత్తింది. అయితే ఇది కేవలం ఓ చిన్న స్థాయి ఎన్నిక కాదని, మునుపెన్నడూ లేని స్థాయిలో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇది వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం కావడంతో ఈ పోటీకి భారీ వేడి వచ్చి చేరింది. ఈ నెల 12న జరిగే ఉపఎన్నికలో రెండు ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీలు తలపడి పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే రెండు పార్టీల నుంచి రెండేసి నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ తన అభ్యర్థిగా మహేశ్వర్ రెడ్డి కుటుంబానికి టిక్కెట్ కేటాయించి, ప్రాంతీయ సెంటిమెంట్‌ను టార్గెట్ చేసింది.


జగన్ ఇమేజ్‌కు ఏ మాత్రం మచ్చపట్టకూడదనే ఒత్తిడిలో వైసీపీ శక్తివంచన లేకుండా పనిచేస్తోంది. జగన్ స్వయంగా ప్రచారానికి రాకపోయినా… బెంగళూరులో నుంచే ఎప్పటికప్పుడు నేతలకు మార్గదర్శకత్వం ఇస్తున్నారన్నది తెలుస్తోంది. మ‌రోవైపు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా పులివెందులలో సత్తా చాటాలనే ఉద్దేశంతో బీటెక్ రవి సతీమణి లతా రెడ్డిని రంగంలోకి దించింది. అంతేగాక బీటెక్ రవి తమ్ముడు జయభరత్ రెడ్డి కూడా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. కుప్పం లో గెలిచి సంబరాలు చేసుకున్న టీడీపీ నేతలు ఇప్పుడు జగన్ గడ్డపై కూడా అదే రిపీట్ చేయాలని చూస్తున్నారు.ఇక ఈ ఎన్నికలో గెలుపు తమదేనని వైసీపీ ధీమాగా ఉంది. తమ అభ్యర్థిని ప్రకటించడమే కాకుండా, మృతుడు ఉన్న కుటుంబానికే సీటు ఇవ్వడం ద్వారా ప్రజల సెంటిమెంట్‌ను తమవైపు తిప్పుకోవాలన్న ఆలోచన కనిపిస్తుంది.


అధికారంలో ఉన్న పార్టీగా అన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగించేందుకు సిద్ధమవుతుంది. మరోవైపు టీడీపీ మాత్రం గెలిచి జగన్‌పై మానసిక ఒత్తిడి తీసుకురావాలన్నదే లక్ష్యం. ప్రతిపక్షంలో ఉన్నా తమ పట్టు తగ్గలేదని ప్రజలకు నిరూపించాలని చూస్తోంది. ఇప్పటికే సీనియర్ నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ ఉపఎన్నిక వల్ల గెలిచే పార్టీకి పెద్దగా అధికార లాభాలు ఏమీ లేకపోయినా, రాజకీయ బలం మాత్రం స్పష్టమవుతుంది. ముఖ్యంగా పులివెందులలో టీడీపీ గెలిస్తే జగన్‌కు అది ఒక రాజకీయ హెచ్చరికగా మారే అవకాశం ఉంది. అందుకే ఈ చిన్న పోటీ పెద్ద యుద్ధంగా మారింది. రాష్ట్రం అంతా ఈ ఫైట్‌ను ఆసక్తిగా గమనిస్తోంది!

మరింత సమాచారం తెలుసుకోండి: