- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు పనితీరును ఇకపై పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు ఎమ్మెల్యేలు తాను ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నారా ? లేదా అనే విషయమై జగన్ ప్రత్యేకంగా నిఘా ఉంచారు. మరీ ముఖ్యంగా రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం పై జగన్ ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తాను కాకుండా పది మంది ఎమ్మెల్యేలు ... అలాగే 164 మంది సమన్వయకర్తలు ఇంటింటికి వెళ్తున్నారా ? పార్టీ ఇచ్చిన ఆదేశాలను ఏ మేరకు అమలు చేస్తున్నారు ? ప్రభుత్వం ఏ విధంగా మాటే తప్పిందని విషయాలను ప్రజలకు వివరిస్తున్నారా ? మొక్కుబడిగా చేస్తున్నారా అనే అంశాలపై జగన్ వేరువేరు మార్గాలలో నివేదికలు తెప్పించుకుంటున్నారు.


తన ఆదేశాలను ముక్కుబడిగా పాటిస్తున్నారా ? నిజంగానే ప్రజల వద్దకు వెళ్లి నిజాలు వివరిస్తున్నారా ? అనేదానిపై జగన్ పూర్తిస్థాయిలో పార్టీ నాయకులు పై నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. కొంతమంది నాయకులు తమను ఎవరు ?గుర్తించలేదని మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టిక్కెట్ దక్కించుకుని కూటమి ప్రభుత్వ వ్యతిరేకతలో గెలవంచని చాలామంది నాయకులు భావిస్తున్నారు. అలాంటి నాయకులకు చెక్ పెట్టే ఆలోచనలో జగన్ ఉన్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రతి సమన్వ‌యకర్త , ఎమ్మెల్యే ల‌ను పిలిపించుకుని ఏడాది ప్రోగ్రెస్ రిపోర్టులు ఇచ్చే ప‌నిలో జ‌గ‌న్‌ ఉన్నారని వైసీపీ ముఖ్య నాయకులు తెలిపారు. పనితీరు బాగా లేని నాయకులకు మరో అవకాశం ఇచ్చి అప్పటికీ తీరు మార్చుకోకపోతే వారిని పక్కన పెట్టడం ఖాయమని వైసిపి లోనే చర్చ జరుగుతుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: