ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ ఎంతో డెవలప్ అయింది. అంతేకాదు ఆంధ్ర నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా సరే హైదరాబాదులోనే పెట్టుబడులు పెట్టి ఇక్కడే జీవించారు. అప్పుడు రాష్ట్రాలు ఒక్కటిగా ఉన్నాయి కాబట్టి  పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణ నినాదం మొదలైందో అప్పటినుంచి కొంతమంది ఆంధ్ర నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ వచ్చాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి రాష్ట్రం గానే ఉండాలని చెబుతూ, వెనకనుంచి రాష్ట్రం విడగొట్టాలని ప్రయత్నం చేశారు. అంతేకాదు కేసీఆర్ కు వెనుక నుంచి చాలా సపోర్ట్ ఇచ్చారు. అలా చివరికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడానికి  ముఖ్య పాత్ర పోషించారని చెప్పవచ్చు. 

అయితే ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో అప్పుడే ఆంధ్ర  నాయకులు అభివృద్ధిపై ఆలోచన చేస్తే బాగుండేది. అలా చేయకుండా ఇప్పటికి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఆనాడు కొంతమంది జర్నలిస్టులు, మేధావులు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టి డెవలప్ చేయండని సజెషన్స్ ఇచ్చినా కానీ ఆంధ్రా నాయకులు పట్టించుకోలేదు. అప్పటి నుంచే చాలామంది విభజన జరగబోతుంది. సినీ రంగాన్ని రాజకీయ రంగాన్ని డెవలప్ చేయండి అంటూ వచ్చారు. కానీ నాయకులు పట్టించుకోలేదు. హైదరాబాద్ తో సమానంగా వైజాగ్ ను డెవలప్ చేయాలని ఎంతమంది చెప్పిన కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. చివరికి ఆంధ్రా తెలంగాణ విభజన జరిగింది.  

ఎంతోమంది ఆంధ్రా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారైతే పిల్లల చదువులు ఇక్కడ, అడ్రస్ ప్రూఫ్స్ అక్కడ, దీంతో వారు స్టడీ విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు సినీ రంగం,  పరిశ్రమలు కూడా హైదరాబాదులోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా తెలంగాణకు హైదరాబాదు వెళ్లిపోవడంతో ఇక్కడికి ఆంధ్రా వాళ్ళు వస్తే వలస వచ్చినట్టే అవుతోంది. ఇప్పటికైనా ఆంద్రాని డెవలప్ చేసి సినీ ఇండస్ట్రీ, మీడియా అన్ని రంగాలను వైజాగ్ లాంటి పట్టణాల్లో డెవలప్ చేస్తే ఆంధ్రాకి ఫ్యూచర్ లో మేలు కలుగుతుందని మేధావులు  తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: