తాజాగా తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన ఒక ఇష్యూ చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... తెలుగుదేశం అధికార ప్రతినిధి అయినటువంటి సుధాకర్ రెడ్డి టి డి పి పార్టీ కి సంబంధించిన ఒక మంత్రి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆ నాయకుడు తిరుపతి కి వస్తూ ఉంటాడు. నాకు అనేక మంది అద్భుతమైన స్థాయిలో గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. అలాంటిది ఆ మంత్రి వచ్చాడు అంటే నాకే ఆయన అపాయింట్మెంట్ దొరకదు. ఆయన ఏకంగా 5 స్టార్ ,  7 స్టార్ హోటల్లో మాత్రమే ఉంటాడు. అమ్మాయిలు కూడా వస్తారు.

ఆయన పక్క రూములో కూడా ఎవరు ఉంటారు అందరికి తెలుసు. అక్కడ ఆయన సరస సల్లపాలు సాగిస్తూ ఉంటారు అని తీవ్ర స్థాయిలో టి డి పి అధికార ప్రతినిధి అయినటువంటి సుధాకర్ రెడ్డి అదే పార్టీ కి సంబంధించిన మరో మంత్రి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇలా సుధాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో టి డి పి మంత్రి పై వ్యాఖ్యలు చేయడంతో ఒక ముగ్గురు సభ్యులతో ఒక ఎంక్వైరీ  కమిటీని నియమించినట్లు తెలుస్తుంది. దానితో ఆ కమిటీ సభ్యులు తిరుపతి వెళ్లి మరి కొన్ని ఎంక్వయిరీలు చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఒక వేళ ముగ్గురు సభ్యుల కమిటీ మొదటగా విచారణ చేయాల్సిన అవసరం వస్తే సుధాకర్ రెడ్డి ని మొదట  విచారించి ,  సుధాకర్ రెడ్డి ఎవరిని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేశారు అనేది తెలుసుకొని , ఆ తర్వాత ఆ హోటల్ పేరు ఏమిటి , ఆయన ఏ రూంలో దిగాడు , ఆయన పక్క రూమ్లో ఎవరు దిగారు అనే దానిని ఆ తర్వాత తెలుసుకొని దానిని ఒక నివేదిక రూపంలో తయారు చేసి దానిని పార్టీకి చేర్చినట్లైతే పర్ఫెక్ట్ గా ఉంటుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి అలాగే చేస్తారా ..? లేక సుధాకర్ రెడ్డి ని మందలించి సారీ చెప్పిస్తారా అనేది చాలా ఉత్కంఠ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: