
ఆ తర్వాతే చంద్రబాబు అలర్ట్ అయ్యి.. ప్రతి రెండు నెలలకు ఒకసారి తన సొంత నియోజకవర్గంలో ప్రజలతో మమేకమయ్యారు. అక్కడ నాయకులతో కూడా మాట్లాడుతూ వచ్చారు. ఎన్నికలకు ఏడాది ముందే తన కుటుంబ సభ్యులతో కూడా ప్రచారం చేయించారు. ఎన్నికలలో గెలిచి తీరాలని అంత హార్డ్ వర్క్ చేయించారు. ఇప్పుడు అలాగే పులివెందులలో కూడా జగన్మోహన్ రెడ్డికి అలాంటి భయమే పట్టుకుంది. ఖచ్చితంగా గెలుస్తామని ధీమా ఉన్నప్పటికీ జడ్పిటిసి ఎన్నికలలో వైసిపి ఓడిపోయింది. కుప్పంలో టిడిపి అప్పుడు ఎలా ఓడిపోయిందో ఇప్పుడు వైసీపీ కూడా జడ్పిటిసి ఉపఎన్నికలలో అలాగే ఓడిపోయింది.
దీంతో జగన్మోహన్ రెడ్డి అలెర్ట్ అయ్యారు. మూడు రోజులపాటు పులివెందల నియోజవర్గంలో ఉన్న గ్రౌండ్ లెవెల్ క్యాడర్ తో , కార్యకర్తలతో , ముఖ్యమైన అనుచారులతో ఇంట్రాక్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే పులివెందులలో వైసిపి పార్టీ క్యాడర్ గ్రౌండ్ లెవెల్ లో సరిగ్గా లేదు.. వైయస్ వివేకానంద రెడ్డి గారు బ్రతికి ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని సుమారుగా 35 ఏళ్ల పాటు కంచుకోటలో ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఆయన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలలో కూడా బిజీగా ఉన్నప్పటికీ.. వివేకానంద రెడ్డి గారు ఇక్కడ కేడర్ ని మెయింటైన్ చేసేవారు. ఏ కష్టం వచ్చినా సరే అండగా ఉండేవారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మరణంతో ఆ లోటును అవినాష్ రెడ్డి లేదా భాస్కర్ రెడ్డి భర్తీ చేస్తారని జగన్మోహన్ రెడ్డి భావించారు. కానీ వీరిద్దరి మీద ఒక పెద్ద ఆరోపణ వినిపించింది.
అలా క్యాడర్లో ప్రజలలో నమ్మకం కోల్పోయారు వీరు. దీంతో పులివెందులలో పార్టీని నిలబెట్టాలి అంటే తానే రంగంలోకి దిగాల్సి వచ్చింది. గ్రౌండ్ లెవెల్ లో ఏం జరుగుతోందనే విషయం తెలుసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.. ఎన్నికలకు ముందు చాలామంది నేతలు తమకు బిల్లులు రాలేదని ,మమ్మల్ని పట్టించుకునే వారు లేదంటూ, ఎవరి పనులు చేయలేదని , ఏ ఇబ్బంది వచ్చిన తీర్చలేదని చాలామంది నేతలు మాట్లాడారు. ఈ ఎఫెక్ట్ ఎన్నికల మీద ప్రభావం పడటంతో కడపలో కూడా ఎక్కువ సీట్లు గెలవలేకపోయింది వైసీపీ. అందుకే ఈసారి ఎన్నికలకు ముందుగానే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. తరచూ సమావేశాలను నిర్వహిస్తూ అక్కడ సమస్యలను తెలుసుకొని మళ్లీ నేతలలో కార్యకర్తలలో జోష్ నింపేయాల జగన్ నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు వినిపిస్తున్నాయి.