భారతదేశంలో గత కొద్ది నెలలుగా మత ఘర్షణలు పెరుగుతున్నాయి. పండుగల సమయంలో ఊరేగింపులు, సంప్రదాయ కార్యక్రమాలు అడ్డుకోవడం వల్ల హిందూ – ముస్లిం మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఆ అగ్ని పొరుగు దేశం నేపాల్‌లోకి కూడా వ్యాపించటం కలకలం రేపుతోంది. సాంప్రదాయంగా నేపాల్‌ను ప్రపంచం మొత్తం హిందూ సంస్కృతికి అడ్డాగా పరిగణిస్తుంది. ఆ దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు పెద్దగా జరగకపోవడం విశేషం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా హిందువులు ఊరేగింపులు నిర్వహిస్తుండగా, వలస వచ్చిన ముస్లింల గుంపులు ఆ ఊరేగింపులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
 

అంతటితో ఆగకుండా రాళ్లు విసరడం, ఆలయాల చుట్టుపక్కల హింసాత్మక వాతావరణం సృష్టించడం మరింత ఆగ్రహానికి దారితీసింది. స్థానిక హిందువులు "ఇది చిన్న సంఘటన కాదు.. ఇది మన సంప్రదాయాలపై ప్రత్యక్ష దాడి" అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. నేపాల్‌లో చోటు చేసుకున్న ఈ పరిణామం భారత్‌లో జరిగిన కొన్ని ఘటనలతో పోలుస్తున్నారు. ఇటీవల నంద్యాలలో చర్చి సమీపంలో ఊరేగింపును అడ్డుకోవడం, రాయచోటిలో ముస్లింలు అభ్యంతరం చెప్పడంతో హిందూ పండుగలు మధ్యలో ఆగిపోవడం పెద్ద వివాదంగా మారాయి. “మన పండుగలు, సంప్రదాయాలను అడ్డుకోవడం ఎక్కడి నుండి వస్తోందో అర్థం కావడం లేదు. ఇది కేవలం మత ఘర్షణ కాదు.. హిందువుల హక్కులపై, వారి సంస్కృతిపై దాడి” అంటూ ప్రజలు మండిపడుతున్నారు.

 

ఇక హిందూ సంఘాలు నేపాల్ ప్రభుత్వాన్ని కఠినంగా హెచ్చరించాయి. “చర్యలు తీసుకోకపోతే ప్రజలు తామే ముందుకు వస్తారు. అవసరమైతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం” అని స్పష్టం చేశాయి. దీనితో ఆ దేశ భవిష్యత్తుపై కూడా ప్రశ్నార్థకాలు నెలకొన్నాయి. ఒకవైపు భారత్‌లో పండుగలపై అడ్డంకులు.. మరోవైపు నేపాల్‌లో హిందూ సంప్రదాయాలపై దాడులు – ఇవి రెండు దేశాల్లోనూ ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. హిందువులు ఇక స్పష్టంగా చెబుతున్నారు: “మన పండుగలు, ఊరేగింపులు ఎవరైనా అడ్డుకుంటే మేము కూర్చోము. సంస్కృతి కోసం, భక్తి కోసం, గౌరవం కోసం పోరాటం తప్పదు!” హిందూ భావోద్వేగాలు ఉధృతమవుతున్న వేళ.. నేపాల్‌లోని ఈ సంఘటన రెండు దేశాల రాజకీయ వాతావరణాన్నీ కుదిపేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: