సినిమా.. సినిమా.. సినిమా..ఈ ఫీల్డ్ ను నమ్ముకొని వేలాదిమంది బ్రతుకుతూ ఉంటారు.. లైట్ బాయ్ నుంచి మొదలు నటీనటుల వరకు సినిమాపై ఆధారపడి జీవనం కొనసాగిస్తారు..అలాంటి సినిమా థియేటర్ లోకి వచ్చి హిట్ సాధిస్తే  ఆ సినిమా కోసం పని చేసిన వారి ఆనందానికి అవధులు ఉండవు. అంతేకాదు ఒక సినిమా తీయాలి అంటే ఇంతమంది వ్యక్తులను మెయింటైన్ చేసేది నిర్మాత మాత్రమే. ఆయన కోట్లాది రూపాయలు వెచ్చిస్తేనే సినిమా నిర్మితమవుతుంది.. అలాంటి సినిమా రంగంలో పైరసి వచ్చి చేరి అంతా ఆగం చేస్తోంది.. కొత్త సినిమా బయటకు రిలీజ్ అవుతుందో లేదో హెచ్ డీ ప్రింట్ తో పైరసీలో సినిమా లభ్యమవుతోంది. మరి ఇంత టెక్నాలజీ వాడి సినిమాను హ్యాక్ చేసేదెవరు అనే వివరాలు చూద్దాం.. పైరసీకి సంబంధించి కీలకమైన విషయాలు బయటకు వచ్చాయి. 

పైరసీ చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి వారి వివరాలు బయటపెట్టారు.. ప్రస్తుతం సినిమాలను పైరసీ చేసే ఒక గ్యాంగ్  ఈసీ వెబ్సైటు కూడా హ్యక్ చేసి ఎన్నికల వ్యవహారాన్ని కూడా మార్చాలని ప్రయత్నం చేశారట. కానీ అది వర్కౌట్ కాలేదని తెలియజేశారు.. పైరసీ వ్యవహారాల్లో ముఖ్యంగా హర్షవర్ధన్ అనే వ్యక్తి  కీలకంగా ఉంటారని ఈయన ఒక సాఫ్ట్వేర్ నిరుద్యోగి అని తెలుస్తోంది. సినిమాలను పైరసీ చేయడంలో కీలక వ్యవహారం నడుపుతుంటారు.. టెలిగ్రామ్ చానల్స్, టోరెంట్స్ ద్వారా పైరసీ చేస్తారట. ఇదే కాకుండా కొత్తగా ఎంవో విధానంలో కూడా పైరసీ చేస్తారని తెలుస్తోంది. ఇందులో ప్రధాన నిందితుడు థియేటర్ కు వెళ్లి కెమెరా పెట్టి దాన్ని అంతా రికార్డు చేసి టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మరో వ్యక్తికి పంపిస్తూ ఉంటారు. ఈ సినిమాలను అప్లోడ్ చేసి బెట్టింగ్, గేమింగ్ యాప్ ల ద్వారా డబ్బులు పొందుతున్నారని తెలుస్తోంది. మంచి కెమెరా క్లారిటీ ఉన్నటువంటి సెల్ ఫోన్లలో నిందితులు సినిమాను రికార్డింగ్ చేస్తారు.

 ఈ కెమెరాలను  జేబులో కానీ, పాప్కాన్ డబ్బాలో కానీ పెట్టి సీక్రెట్ గా కిరణ్ కుమార్ అనే వ్యక్తి రికార్డు చేస్తారని  పోలీసులు వెల్లడించారు. జేబులో సెల్ఫోన్ పెట్టుకుని స్క్రీన్ లైట్ ఆఫ్ చేసి ఎవరికి అనుమానం రాకుండా క్లియర్ గా రికార్డు చేస్తారట. ఈ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ఆత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించారని తెలుస్తోంది. ఈ యాప్ ల ద్వారా ఆయన నెలకి 9 లక్షల చెల్లింపులు దాకా పొందినట్టు తెలుస్తోంది.. ఈ విధంగా వీరి పుట చాలా పెద్దగా ఉందని, ఇందులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు గవర్నమెంట్ వెబ్ సైట్ లను కూడా హ్యాక్ చేసే టాలెంట్ కలిగినవారని, ఈ విధంగా అన్ని రంగాలలో హ్యాక్ చేసుకుంటూ వస్తున్నారని తెలియజేశారు. వీరి హ్యాకింగ్ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమ రూ:3700 కోట్లు నష్టపోయిందని  పోలీసులు తెలియజేశారు. వీరి నుంచి తప్పించుకోవాలి అంటే సినిమా ఫుటేజ్ ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: