
ట్రంప్ వ్యవహార శైలి పూర్తిగా అసాధారణమైనదని, సంప్రదాయ దౌత్య నిబంధనలను గౌరవించడం లేదని తరూర్ విమర్శించారు. వైట్‌హౌస్ నుంచి ఇలాంటి ప్రవర్తన ఎన్నడూ చూడలేదని ఆయన అన్నారు. ట్రంప్ తాను నోబెల్ బహుమతికి అర్హుడని చెప్పుకోవడం, దేశాలు అమెరికాకు మొకాళ్లు మోకరిల్లుకుంటాయని చెప్పడం వంటి మాటలు అసాధారణమని ఆయన ప్రశ్నించారు. భారత్, రష్యా ఆర్థిక వ్యవస్థలను 'డెడ్ ఎకానమీ' అని తిట్టడం ఒక అధ్యక్షుడి నుంచి వినిపించకూడని భాష అని తరూర్ స్పష్టం చేశారు. ట్రంప్ ప్రవర్తన ద్వారా భారత పనితీరును నిర్ణయించకూడదని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలు అమెరికా-భారత సంబంధాలపై చర్చలకు దారితీశాయి.ఈ సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థకు తీవ్ర దెబ్బ తీస్తున్నాయని తరూర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ట్రంప్ 'స్కూల్‌యార్డ్ బుల్లీ' లాంటి వ్యూహంతో వ్యవహరిస్తున్నారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. భారత్ ఈ ప్రభావాన్ని తగ్గించడానికి ఇతర మార్కెట్లను అన్వేషించాలని, వియత్నాం, థాయ్‌లాండ్, టర్కీ వంటి దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయాలని సూచించారు. అమెరికా మార్కెట్‌పై మాత్రమే ఆధారపడకుండా యూకే, ఆఫ్రికా, ఆసియా దేశాలతో ఎఫ్‌టీఏలు కుదుర్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సుంకాలు భారత లేబర్ ఇంటెన్సివ్ పరిశ్రమలకు మరింత నష్టం కలిగిస్తాయని ఆయన హెచ్చరించారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు