బీహార్ లో ఎన్నికల వేడి గత సంవత్సర కాలం నుంచే పుట్టింది. ఈసారి కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిపి కూటమిగా ఏర్పడింది. ఇదే తరుణంలో బిజెపి,జేడియు కూడా ఎలాగైనా ఇక్కడ గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఎన్నికల కోడ్ కూడా అమలులోకి వచ్చింది. మొత్తం 243 స్థానాలకు గాను  7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో నవంబర్ 6, 11 తేదీల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. 14న కౌంటింగ్ ఉంటుందని ఇప్పటికే ఈసీ తెలియజేసింది. ఇదే  తరుణంలో ఎలక్షన్స్ అవ్వకముందే కాంగ్రెస్ గెలుపుపై ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. అంతేకాదు సీఎం అభ్యర్థిపై కూడా  కూటమివాళ్లు క్లారిటీ ఇచ్చారు.

ఈ సమయంలో విపక్ష కూటమి నుంచి తేజస్వి యాదవ్ పేరు ఎక్కువగా వినపడుతోంది. అయితే దీనిపై కాంగ్రెస్ నేత  ఉదిత్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆర్జెడి  పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థి కానీ కూటమికి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది మేమంతా కలిసి కూర్చొని డిసైడ్ చేసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంపై తేజస్వి యాదవ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ ఈ మధ్యకాలంలో ఒక స్పీచ్ లో మాట్లాడుతూ..ప్రజలే  యజమానులు..వారే ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకుంటారు. వారు మార్పు కావాలని అనుకుంటున్నారు ముఖ్యమంత్రిని ఎవరిని ఎన్నుకుంటారో వారికే తెలుసని చెప్పుకొచ్చారు.

అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిపై రాహుల్ గాంధీ కూడా ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే కూటమి ఏర్పడక ముందే అభ్యర్థిని ప్రకటించి  ఎన్నికల ప్రచారానికి వెళ్తామని చెప్పుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కూడా అభ్యర్థిని క్లారిటీగా ప్రకటించకపోవడం విడ్డూరంగా ఉంది. అంతేకాకుండా  రాహుల్ గాంధీని సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నిస్తే  నేరుగా సమాధానం చెప్పకుండా ఇండియా కూటమి బ్లాక్ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. మేము కలిసి పోటీ చేస్తున్నాం  ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయని ఆశిస్తున్నానని అన్నారు. మరి చూడాలి బీహార్ లో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందా లేదా అనేది కొన్ని రోజుల్లోనే తెలియబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: