ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో  స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు స్టే విధించింది. దీంతో అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఎన్నికపై పడింది. ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనేది చాలా ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఈ గెలుపు అనేది అన్ని పార్టీలకు ఒక పెద్ద బూస్టింగ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది చాలా ప్రతిష్టాత్మకం. ఇక్కడ గెలిస్తే అదే ఊపుతో రాష్ట్రమంతా  కార్యకర్తల్లో, నాయకుల్లో ఉత్సాహం వస్తుంది. అలాగే బిజెపికి  కొత్త అధ్యక్షుడు వచ్చాడు కాబట్టి ఆయన హయాంలో జరిగే మొదటి ఎన్నిక.. ఇక్కడ గెలిపిస్తే ఆయన సత్తా ఏంటో ఢిల్లీలో కూడా తెలుస్తుంది. ఈ రెండు పార్టీలు ఇలా ఆలోచిస్తుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎలాగైనా సీట్ ని గెలిచి హైదరాబాదులో పట్టు సాధించాలని చూస్తోంది. అలాంటి ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ అనే అభ్యర్థిని ప్రకటించింది. 

అయితే ఈయన ఇప్పటికే ఇక్కడ రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. అంతేకాదు యాదవ్ ఓట్లు, ముస్లిం ఓట్లు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండటం వల్ల కలిసొచ్చే అవకాశం ఉంది. మజిలీస్ పార్టీ నుంచి అప్పట్లో పోటీ చేశారు కాబట్టి ఇప్పుడు ముస్లింలందరూ నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా అన్ని పాజిటివ్ గానే ఉన్న నవీన్ యాదవ్ కు మాత్రం కాస్త నోటి దురుసు ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆయన తన ప్రచారం తాను చేసుకోకుండా ఇతర నాయకులపై లేనిపోని అబాండాలు వేస్తున్నారని మాట్లాడుతున్నారు. అయితే తాజాగా నవీన్ మాట్లాడుతూ  నేను లోకల్..ఇదివరకు పోటీ చేసిన చాలామంది నాన్ లోకల్ అంటూ మాట్లాడారు. దాదాపుగా 47 సంవత్సరాలలో లోకల్ అభ్యర్థికి ఇక్కడ టికెట్ దక్కలేదని తెలియజేశారు. అయితే ఈ ప్రాంతం నుంచి పోటీ చేసిన వారిలో పి.జే.ఆర్ గొప్ప నాయకుడిగా ఎదిగారని తెలియజేశారు.

కానీ ఆయన కూడా నాన్ లోకల్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే పేదల గుండెల్లో నిలిచినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి 2007లో పదవిలో ఉండగానే గుండెపోటుతో మరణించారు. అయితే ఈయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి పీజేఆర్ ని నాన్ లోకల్ అని అనడంతో ఆయన అభిమానులంతా భగ్గుమంటున్నారు. ఆయన ముందు నవీన్ యాదవ్ వయసు ఎంత ఆయన రాజకీయ అనుభవం అంత కాదంటూ మాట్లాడుతున్నారు. చనిపోయిన పీజేఆర్ పై ఇలా మాట్లాడడం సరికాదని విమర్శిస్తున్నారు. నవీన్ యాదవ్ పీజేఆర్ ను నాన్ లోకల్ అని చేసిన వ్యాఖ్యలు ఎలక్షన్స్లో కాస్త మైనస్ గా మారే అవకాశం ఉంది. పీజేఆర్ అభిమానులు ఈయనకు పెద్దగా సపోర్ట్ చేసే అవకాశం అయితే కనిపించడం లేదు. మరి దీనిపై నవీన్ యాదవ్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది ముందు ముందు తెలియబోతోంది.ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల విషయానికి వస్తే నవంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: