ప్రస్తుతం శబరిమల అయ్యప్ప క్షేత్రానికి సంబంధించిన ఓ వివాదం కేరళాలో నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయ్యప్ప స్వామికి సంబంధించి కిలోల కొద్ది బంగారం మాయమవ్వడంతో ఈ విషయం కాస్త కేరళ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే తాజాగా అయ్యప్ప క్షేత్రంలోని బంగారం మాయం అవ్వడం గురించి కొన్ని సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు మనం ఓ విషయం గురించి చూద్దాం. 2019లో కేరళలోని అయ్యప్ప స్వామి గర్భగుడిలో ఉండే ద్వారపాలక విగ్రహాలకు బంగారం పూత పూయాలని వాటిని బయటకు తీశారు. అయితే ఆ సమయంలో మళ్ళీ గుడిలో పెట్టే సమయంలో దాదాపు నాలుగు కిలోల బంగారం మాయమైంది అనే విషయం వెలుగులోకి రావడంతో ఇది కాస్త హైకోర్టులోకి వెళ్ళింది. 

దాంతో పూర్తి జాబితా రెడీ చేయాలి అని  మాజీ న్యాయమూర్తిని అక్కడి సర్వోన్నత న్యాయస్థానం నియమించింది. అయితే ఈ కేసు హైకోర్టులో ఉండగానే ఈ ఏడాది హైకోర్టులో ఉండగానే హై కోర్ట్ కి చెప్పకుండానే మళ్లీ విగ్రహాలు బంగారం పూత కోసం బయటికి తీశారు. అయితే ఈ వివాదం ఇలా కొనసాగుతున్న వేళ తాజాగా నేషనల్ మీడియా సంస్థలు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించగా.. ఇందులో కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. అప్పట్లో మలయాళ నటుడు జయరాం ఇంట్లోకి పూజ నిర్వహించడం కోసం ఆ విగ్రహాలను తరలించారు అనే విషయం బయటపడింది.

అయితే బంగారం పూత కోసం తీసిన ఆ విగ్రహాలను నేరుగా షాప్ కి తీసుకెళ్లకుండా కొన్ని ప్రైవేట్ ఆలయాలకు, వివిధ ప్రదేశాలకు తరలించి పూజలు నిర్వహించారు. మలయాళ నటుడు జయరాం ఇంట్లో పూజ కోసం విగ్రహాలని తరలించగా ఆ తర్వాత విగ్రహాలను శబరిమల తీసుకెళ్లారు. ఆ సమయంలో బంగారు కవచాలను జయరాం ఇంట్లో పూజలో పెట్టారు. మళ్ళీ పూజ అయిపోయాక శబరిమలకు తరలించారు. ఇలా విగ్రహాలను నేరుగా షాప్ కి కాకుండా ప్రైవేటు ప్లేసులకి వివిధ ప్రదేశాలకు ఎందుకు తరలించారు అనే అనుమానం వ్యక్తం అవుతుంది. మరి శబరిమల అయ్యప్ప బంగారం చోరీ పై ఏ విషయం బయటపడుతుందో వేచి చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: