మరికొన్ని రోజుల్లో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ ఇప్పటికే విడుదల చేసింది. బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా జరగనున్నాయి. ఇక బీహార్ రాష్ట్రంలో ఎలాగైనా గెలవాలి అని అక్కడి ప్రధాన పార్టీలు అన్నీ కూడా పెద్ద ఎత్తున కసరత్తులను చేస్తున్నాయి. ఎన్నికలు వచ్చాయి అంటే చాలు పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేయడం , ఓటర్లను మభ్య పరిచేందుకు కొన్ని రాజకీయ పార్టీల నాయకులు డబ్బును , మద్యం ను , ఇతర విలువైన వస్తువులను , అలాగే ఓటర్లకు పంచడానికి కొన్ని వస్తువులను ఒక చోటి నుండి ఒక చోటికి తరలిస్తూ ఉంటారు. అలాంటి క్రమంలో ఓటర్లను మభ్య పరిచేందుకు వారు చేస్తున్న పనులను అరికట్టేందుకు ఎన్నికల కమిషన్ కూడా పెద్ద ఎత్తున తనిఖీలను చేస్తూ ఉంటుంది.

దానితో ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయో ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నగదు మద్యం పట్టుబడడం అనేది సహజం. ఇకపోతే బీహార్ రాష్ట్రంలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున డబ్బు , నగదు , ఇతర వస్తువులను పోలీసులు పట్టుకున్నారు. అసలు విషయం లోకి వెళితే ...  మరికొన్ని రోజుల్లో జరగబోయే బీహార్ ఎన్నికల కోసం పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలను చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకు 37.14 కోట్ల విలువైన నగదు , మద్యం ను పోలీసులు పట్టుకున్నారు. ఇక ఒక్క బుధవారం రోజే రాష్ట్రం లోని పలు ప్రాంతాలలో కలిపి పోలీసులు 1.28 కోట్ల విలువైన నగదు , మద్యం ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా బీహార్ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో జరగబోయే ఎన్నికల కోసం పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా ఆ తనిఖీలలో ఆక్రమంగా తరలిస్తున్న డబ్బు , నగదు , ఇతర వస్తువులు వారు స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: