ముఖ్యంగా గోదావరి జిల్లాలో పచ్చదనమే రాష్ట్రం విడిపోవడానికి కారణమని తెలంగాణ నాయకులు చెప్పేవారంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకు సైతం బిఆర్ఎస్ మాజీమంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ వేస్తూ మీడియాతో మాట్లాడారు. జగదీష్ రెడ్డి ఇలా మాట్లాడుతూ హైదరాబాదు నుంచి ఎవరు కోనసీమకు వెళ్లి రాలేదని.. ప్రతిరోజు అక్కడ నుంచి హైదరాబాదుకి వందలాది మంది ఉపాధి కోసం, అవసరాల కోసం వస్తున్నారు.. తగిలితే హైదరాబాద్ కి వాళ్ళ దిష్టే తగులుతుందంటూ మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది.
ఒకవేళ దిష్టి తగులుతుందనే భయం ఉంటే ఓ దిష్టిబొమ్మను పెట్టుకోవాలని అందుకు మేము ఏమైనా అడ్డు వచ్చామా అంటూ మాట్లాడారు జగదీశ్ రెడ్డి. మాట్లాడేటప్పుడు నాలుకని కంట్రోల్ లేకుండా మాట్లాడకూడదని, ఇలాంటి వాళ్లు ఉపముఖ్యమంత్రులు అవుతున్నారంటూ పలు రకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బిఆర్ఎస్ నేతలు వైరల్ గా చేస్తున్నారు. ఈ విషయాల పైన రెండు రాష్ట్రాల నేటిజన్స్ కూడా భిన్నాభిప్రాయాలతో స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఈ మాటల యుద్ధం ఇక్కడితో ఆగుతుందా లేకపోతే మరింత రాజకీయంగా రగిలిస్తుందా ?అనే విషయం చూడాలి మరి. ప్రస్తుతం జగదీశ్ రెడ్డి కౌంటర్ వేసిన వీడియో వైరల్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి