ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షర్మిల కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షురాలిగా 2024 ఎలక్షన్స్ కు ముందే నియమితురాలు అయింది. ఆమె అక్కడ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉంది కానీ కనీసం ఎక్కడ కూడా అధికార పార్టీని విమర్శించడం లేదు. విమర్శించక పోయిన పర్వాలేదు కానీ  అక్కడ టిడిపికి ఆమె సపోర్ట్ చేస్తూ వస్తుందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ విధంగా నడుస్తున్న సమయంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలన గురించి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక ఖర్గే ప్రస్తుతం కర్ణాటక క్యాబినెట్ లో మినిస్టర్ హోదాలో ఉన్నారు. ఇదే సమయంలో ఆయన కర్ణాటక రాష్ట్రంలో సీఎం, డిప్యూటీ సీఎం లను కనీసం పట్టించుకోకుండా ఆర్ఎస్ఎస్, బిజెపిని విమర్శిస్తూ చాలా హైలెట్ అవుతున్నాడు. ఆయన చేసిన ప్రతి విమర్శ బీజేపీని ఎంతో ఇబ్బంది పెట్టే విధంగా ఉండడంతో ఆయనకు ముస్లిం ఓటర్లంతా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. 

ఇదంతా బాగానే ఉన్నా ఆయన తన రాష్ట్ర నాయకులపై విమర్శలు చేస్తే పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కూడా విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన విమర్శలు షర్మిలకు తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం లక్షలాదికోట్ల అప్పులు తీసుకొస్తోందని దీనివల్ల రాష్ట్రం దివాలా తీస్తుందని ఆరోపిస్తూ వస్తున్నారు. కర్ణాటక  రాష్ట్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఆజమాయిషి చేయడంతో అసలు షర్మిల కాంగ్రెస్ లో ఉందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా ఏదైనా విమర్శ చేస్తే షర్మిలా చేయాలి కానీ  ప్రియాంక ఖర్గే ఇలా వ్యవహరించడంతో అది షర్మిలకు పెద్ద తలనొప్పిగా తయారయ్యింది.

అంటే షర్మిలకు ఆ రాష్ట్రంలో ఏమి చేతకావడం లేదు.. అందుకే మేము విమర్శ చేస్తున్నాం అనే భావాన్ని ప్రజల్లో కలిగిస్తున్నారు కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే. నిజానికి షర్మిలకి రాష్ట్ర పరిస్థితులు, అక్కడ పేద ప్రజలకు పథకాలు అందుతున్నాయా లేదా అనేది అనాలసిస్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పకుండా విమర్శించే స్థాయి ఉంది. కానీ ఆమె టిడిపి కూటమితో దోస్తీ చేస్తూ కనీసం నోరు మెదపడం లేదు. అలా సైలెంట్ గా ఉన్న తరుణంలో పక్క రాష్ట్ర మంత్రి ఇలా మాట్లాడడంతో షర్మిల కాంగ్రెస్ లో ఉందా లేదా అనే అనుమానాలు చాలామందికి కలుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: