బంగారం ధరలు తగ్గడానికి ముఖ్య కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడినటువంటి మార్పులు, ఒకపక్క రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా బంగారం ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర భారీగా తగ్గిపోయిందని.. ఒకానొక దశలో రూ. 4,396 డాలర్లు ఉండగా, రూ .400 డాలర్లు పడిపోయిందని ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర రూ. 3,980 డాలర్ల వద్ద ఉన్నది. అలాగే అమెరికా, చైనా వంటి ప్రాంతాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా అధ్యక్షుడు చైనా అధ్యక్షుడు ఈ గురువారం సమావేశం కాబోతున్నారు.
ముఖ్యంగా ఈ రెండు దేశాల మధ్య సుంకాల పెంపు విషయం పైన చర్చించే విధంగా ప్లాన్ చేశారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి బంగారం ధరలు 25 శాతం పెరిగాయి, 2026 చివరి నాటికి ఒక ఔన్స్ రూ. 3,500 డాలర్ల వరకు తగ్గవచ్చు అంటూ నిపుణులు తెలియజేస్తున్నారు. వెండి ధర కూడా రూ. 1,40 వేలకు చేరుతుందని తెలియజేస్తున్నారు. ఒకానొక దశంలో రూ .2 లక్షల వరకు పలికిన వెండి ఇప్పుడు భారీగా పడిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి