ఏపీలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో పాత కృష్ణా జిల్లా స‌రికొత్త‌గా రూపాంత‌రం చెందుతోంది. గ‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన జిల్లాల మార్పులో ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని నూజివీడు, కైక‌లూరు రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఏలూరు జిల్లాలో క‌లిపారు. ఇప్పుడు మ‌ళ్లీ నూజివీడు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు త‌మ‌ను ఎన్టీఆర్ జిల్లాలో క‌ల‌పాల‌ని గ‌ట్టిగా ప‌ట్టుబ‌డుతున్నారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియలో ప్రజల ఆకాంక్షలు, చారిత్రక నేపథ్యం, భౌగోళిక అనుసంధానం మరియు పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం అత్యంత అవసరం. ఈ సందర్భంలో నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్.టి.ఆర్ జిల్లాలో భాగంగా ఉంచాలని ప్రజల విస్తృతమైన అభిలాష వ్యక్తమవుతోంది.


నూజివీడు పట్టణం సాంస్కృతికంగా, ఆర్థికంగా, విద్యా మరియు పరిపాలనా పరంగా విజయవాడ ( ప్రస్తుత ఎన్.టి.ఆర్ జిల్లా ) తో సహజమైన మరియు బలమైన అనుసంధానాన్ని కలిగి ఉంది. ప్రజల దైనందిన జీవన విధానాలు, వాణిజ్య, వైద్య, ఉపాధి మరియు విద్యావ్యవహారాలు విజయవాడకే కేంద్రబిందువుగా సాగుతున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గ‌ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ, నూజివీడును ఎన్.టి.ఆర్ జిల్లాలో కలపాల‌న్న డిమాండ్లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. ఈ డిమాండ్‌కు విస్తృతమైన ప్రజా మద్దతు లభిస్తోంది. ప్రజా సంఘాలు, వృత్తి సంఘాలు, సామాజిక సంస్థలు మరియు వివిధ వర్గాలు ఏకగ్రీవంగా నూజివీడును ఎన్.టి.ఆర్ జిల్లాలో కలపాలని గతంలోనే తీర్మానించాయి.


ఇక ఇప్పుడు ఏలూరు జిల్లాలో ఉన్న కైక‌లూరు ను బంద‌రు కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో క‌ల‌పాల‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే నూజివీడు ను ఎన్టీఆర్ జిల్లాలో .. కైక‌లూరు ను కృష్ణా జిల్లాలో క‌ల‌పాల‌ని మంత్రి వ‌ర్గ ఉప సంఘం ప్ర‌భుత్వానికి నివేదిక  ఇచ్చేశారు. ఏదేమైనా పాత కృష్ణా జిల్లా ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలుగా రూపాంత‌రం చెంద‌నుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: