తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ చిన్ని మధ్య వివాదం చెలరేగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు నేతలు కూడా ఒకరి పైన మరొకరు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఓపెన్ గానే విమర్శలు చేశారు. అంతేకాకుండా మీడియాకు ఎక్కి మరి ఇద్దరూ నాన్న రచ్చ చేశారు. ఈ విషయం టిడిపిలోనే సంచలనంగా మారింది. వీరి వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఏకంగా క్రమశిక్షణ కమిటీకి ఆరాతీయమని ఆదేశాలను జారీ చేశారు చంద్రబాబు.
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు క్రమశిక్షణ కమిటీ సభ్యులు నేతల మధ్య వివాదం పై ఆరతీయగా ఇరువురి నుంచి వివరణ తీసుకున్నారు. మరి ఆ నివేదికలో ఏముంది? అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. నివేదిక పరిశీలించిన తర్వాత సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు! ఎవరిపైన చర్యలు తీసుకుంటారనేదే ఇప్పుడు టిడిపి పార్టీలో ఆసక్తికరంగా మారింది. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం చిన్ని ఏకంగా రూ .5 కోట్ల రూపాయలు తీసుకున్నారంటూ కొలికపూడి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఈ విషయం పైన ఎంపీ చిన్ని వైసిపి కోవర్ట్ అంటూ కొలికపూడి పైన ఫైర్ అయ్యారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి