- మెడికల్ కాలేజ్‌ల పీపీపీపై విజయరాజు, సునీల్ ధ్వజం
- రాయకుంల ఆధ్వర్యంలో భారీ జనసమీకరణ
- తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేత
రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజ్‌ల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం మండల కేంద్రంలో వైసీపీ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలతో చేపట్టిన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. కామవరపుకోట మండల వైసీపీ అధ్యక్షులు రాయంకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ కంభం విజయరాజు, ఏలూరు లోక్‌సభ పార్టీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ పాల్గొన్నారు. అదే టైంలో మండలి ఛైర్మన్ కొయ్యే మేషేన్‌రాజు అక్కడకు రావడంతో వైసీపీ నాయకులు ఆయనను కలిశారు. ముందుగా స్థానిక చౌతనా సెంటర్‌కు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, నగర పంచాయతీ, మున్సిపాల్టీ నుంచి కార్లు, బైక్‌లపై భారీగా నాయకులు తరలివచ్చారు. అక్కడ నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా తహసీల్దార్ ఆఫీసు వరకు వచ్చారు. అయితే ప్రధాన రహదారి మీదే పోలీసులు వైసీపీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. తహసీల్దార్ ఆఫీసు లోపలకు పరిమిత సంఖ్యలో ప్రధాన నాయకులను అనుమతించడంతో వీరు కార్యాలయంలో అధికారులకు వినపతిపత్రం అందజేశారు. భారీ జనసమీకరణతో ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మండల వైసీపీ అధ్యక్షులు రాయంకుల సత్యనారాయణను విజయరాజు, సునీల్ అభినందించారు.
పేదవాడి డాక్టర్ కల నెరవేరు: విజయరాజు
అనంతరం విజయరాజు మాట్లాడుతూ మెడికల్ కాలేజ్‌లు ప్రైవేటీ కరణ చేస్తే పెదవాడికి డాక్టర్ అయ్యే కల నెరవేరదు అని.. పేదవాడికి నాణ్యమైన వైద్యం కూడా అందదన్నారు. చంద్రబాబు వేల కోట్ల ప్రభుత్వ ఆస్తిని తన బంధుగణానికి కట్టబెడుతున్నారని విమర్శించారు. ఈ ప్రైవేటీకరణ కూటమి ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు నిదర్శనం అని ధ్వజమెత్తారు. జగన్ పాలన ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు పాలన చేయాలన్నారు.
పీపీపీ ఒక బూటకం: కారుమూరి సునీల్‌కుమార్
గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రైవేటు కాలేజీలను పీపీపీ పేరుతో వారి మనుష్యులకు కట్టబెట్టేలా .. వారు దోచుకునేందుకు బాబు ప్లాన్ చేశారు. దీని వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు డాక్టర్ అవ్వాలనే కల నెరవేరదు. కడప మెడికల్ కాలేజ్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా అక్కడ ఎక్వీప్‌మెంట్ తరలిస్తున్నారు. కూటమి పాలన అంతా రివర్స్‌లో వెళుతోంది. ప్రజలకు మంచిచేసే పనులు జగన్ ప్రభుత్వం చేస్తే... ప్రజలను కష్టపెట్టే పనులు కూటమి ప్రభుత్వం చేస్తోంది.
పేదవాళ్లు డాక్టర్ అవ్వకూడదా.. చంద్రబాబుకు సరితారెడ్డి ప్రశ్న...
కూటమి నాయకులు ప్రతిది ప్రైవేటీకరణ చేస్తున్నారు. పీపీపీ విధానంతో పేదవాళ్లు డాక్టర్ కాకూడదు అన్నదే చంద్రబాబు ఉద్దేశమా ? అని ఏలూరు జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు సరితా విజయ్‌భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిని ఇబ్బంది పెడుతూ వాక్ స్వాతంత్య్రపు హక్కును కూడా కాలరాస్తున్నారు.
పోలీసుల భారీ బందోబస్తు :
ఇటీవల కామవరపుకోట మండలంలో మండల వైసీపీ అధ్యక్షులు రాయంకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ కార్యక్రమాలకు భారీ ఎత్తున జనాలు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నియోజకవర్గ స్థాయి ర్యాలీ కావడంతో పోలీసులు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు తలెత్తుకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం సీఐ సుభాష్, కామవరపుకోట ఎస్సై చెన్నారావు, ధర్మాజీగూడెం ఎస్సై వెంకన్న ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
కార్యక్రమంలో కారుమూరి సునీల్‌కుమార్, కంభం విజయరాజు, రాయంకుల సత్యనారాయణ, మాజీ ఏఎంసీ ఛైర్మన్ జగ్గవరపు జానకీరెడ్డి, జిల్లా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కీసరి సరితా విజయ్‌భాస్కర్ రెడ్డి, లింగపాలెం మండల వైసీపీ అధ్యక్షులు అన్నపనేని శాంతారావు, నియోజకవర్గ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి