జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చాలా అట్టహాసంగా ముగిసింది.  నవంబర్ 11న పోలింగ్ పూర్తయింది. ఇక అభ్యర్థుల భవితవ్యం అనేది బ్యాలెట్ బాక్సుల్లో ఉంది. 14న ఎవరు జూబ్లీహిల్స్ పై జెండా పాతుతారు, ఎవరు ఓడిపోతారు అనేది రెండు మూడు గంటల్లో బయటకు వస్తుంది.  ఇదే సమయంలో తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఆ ఎన్నికలు ఎక్కడ రాబోతున్నాయి కారణమేమిటి వివరాలు చూద్దాం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్ గెలుస్తుందని తెలియజేసింది. అంతేకాదు కాంగ్రెస్ అధిష్టానం మొత్తం నవీన్ యాదవ్ గెలుస్తాడనే ధీమాతో ఉన్నారు.  ఇది పక్కన పెడితే ఎన్నికల ఫలితం పాజిటివ్ గా వచ్చిన వెంటనే తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు రాబోతున్నట్టు తెలుస్తోంది.

 అది ఎక్కడెక్కడ అంటే ఖైరతాబాద్, స్టేషన్  ఘాన్పూర్.  అయితే ఈ రెండు ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు  ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి మారారని  ఆరోపణలు ఉన్నాయి.. ఇంతకీ వారు ఎవరయ్యా అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘాన్పూర్ ఎమ్మెల్యే  కడియం శ్రీహరి.. వీళ్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కలిసి పార్టీ ఫిరాయించారని చెబుతూ కోర్టులో కేసు వేశారు..అయితే కోర్టులో తీర్పు ఆ విధంగా ఉండగానే, వీరికి సంబంధించి ఎన్నిక క్యాన్సిల్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కోర్టు తీర్పు రాకముందే ఇక్కడ ఉపఎన్నికలు పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తుందని, తప్పకుండా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి  పోటీ చేసిన వాళ్లే గెలుస్తారని   భావిస్తున్నారట..

మరి ఇందులో ఎంతవరకు నిజముందో, అబద్ధం ఉందో తెలియదు కానీ దీనికి సంబంధించి సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి.. కట్ చేస్తే అసలు పార్టీ ఫిరాయింపులు అనేది మొదలుపెట్టిందే బీఆర్ఎస్ పార్టీ.. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు  కనీసం కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా ఉండకుండా అందరిని తమలో కలిపేసుకున్నారు.. తాను మొదలుపెట్టిన దారిలోనే కాంగ్రెస్ కూడా నడుస్తోంది.. ఆనాడు వాళ్లు చేసింది తప్పుకాకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసింది కూడా తప్పుకాదని ఇరు పార్టీల నాయకులు విమర్శించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: