తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత, ఉదయం 8 గంటలకు సాధారణ ఓట్ల లెక్కింపు మొదలైంది. పోస్టల్ బ్యాలెట్లలోనే ఎన్.డీ.ఏ కూటమి తమ సత్తా చాటింది. 36 స్థానాల్లో ఎన్.డీ.ఏ అభ్యర్థులు ముందంజలో ఉండగా, మహాఘట్ బంధన్ 12 స్థానాల్లో ఆధిక్యం చూపింది.
ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం, ఎన్.డీ.ఏ కూటమి ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ను దాటి దూసుకుపోవడం విశేషం. ఈ జోరు చూస్తుంటే, సులువుగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు రాబోతున్నాయని విజయ్ కుమార్ సిన్హా వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం.
అలీ నగర్ నియోజకవర్గంలో ప్రముఖ సింగర్, బీజేపీ అభ్యర్థి మైథిలీ ఠాకూర్ వెనుకంజలో ఉండటం కొద్దిగా ఆశ్చర్యపరిచే అంశం. జనశక్తి జనతా దళ్ పేరుతో కొత్త పార్టీని స్థాపించిన లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మహువాలో ముందంజలో ఉన్నారు. జముయ్‌లో బీజేపీ అభ్యర్థి శ్రేయాస్ సింగ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మరోవైపు, ఎన్నికల్లో కీలకంగా మారిన ప్రశాంత్ కిషోర్ పార్టీ అయిన 'జన్ సురాజ్ పార్టీ' ఒక స్థానంలో ముందంజలో కొనసాగుతోంది. బలమైన కూటముల మధ్య జన్ సురాజ్ పార్టీ ఒక్క స్థానంలో విజయం సాధించినా అది రాజకీయంగా ఒక సంచలనం అవుతుందనడంలో సందేహం లేదు. మొత్తం మీద బీహార్ ఓటర్ల తీర్పు ఎన్.డీ.ఏ కూటమికి అనుకూలంగా కనిపిస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
tag : prashant kishore
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి