కామవరపుకోట, మేజర్‌న్యూస్: మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణతో నిరసన కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం మండలంలో కొత్తూరు గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ కంభం విజయరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు.మండల కన్వీనర్ రాయంకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విజయరాజు మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణతో కూటమి ప్రభుత్వానికి పాతర వేయడం ఖాయమన్నారు. వైద్య విద్యను కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు దూరం చేస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా సొంత బలంతో గెలవలేకపోయాడని, దత్తపుత్రుడు ఆర్భాటాన్ని ప్రజలు నమ్మబట్టే గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు. ఇప్పుడు ప్రజలు నిజం తెలుసుకుని వైయస్ జగన్మోహన్ రెడ్డి నిజాయితీని విశ్వనీయతను నమ్ముతున్నామని ప్రజలు అంటున్నారు అన్నారు.2029 లో వైయస్సార్సీపి పార్టీ పాలన చేపడుతుందని దేమ వ్యక్తం చేశారు.
రాయంకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని గ్రామంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షులు రాయంకుల సత్యనారాయణ, వైఎస్ ఎంపీపీ తమ్మిశెట్టి గిరిజా సరస్వతీ, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి భీమిరెడ్డి వెంకన్న, సర్పంచ్ దేవరపల్లి రామ్మోహన్ రావు, గుర్రాల రవికుమార్, మేరుగు బాబురావు, మేడంకి విజయరావు, మండల వైసీపీ యూత్ అధ్యక్షులు చింతనబోయిన సుబ్రహ్మణ్యం యాదవ్, మండల ఎస్టీసెల్ అధ్యక్షులు సిరిశెట్టి సిద్ధిరాజు, మండల మేధావులు సంఘం అధ్యక్షులు సాక వెంకటరత్నం. బూత్ కమిటీ మండల అధ్యక్షులు మానుకొండ దేవరాజు, చింతపల్లి సుధ, మండల గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు మేడంకి బుజ్జి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శిభోగయ్య, నల్లూరి ప్రభాకారావు, తమ్మిశెట్టి సుబ్రహ్మణ్యం, మండల వలంటీర్ విభాగ అధ్యక్షులు వనం గోపి, పంచాయతీ రాజ్ మండల విభాగం అధ్యక్షులు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి