ఆ విధంగా రవి జీవితంలోని చిన్న చిన్న అలవాట్లు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.రవి ఎక్కువ కాలం విదేశాల్లోనే ఉంటాడు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఇంటికి అరుదుగా వస్తాడు. వచ్చినప్పుడు ఒక సన్నిహిత స్నేహితుడితో కలిసి మద్యం సేవించడం అతని రొటీన్. ఆ స్నేహితుడి ఫోన్ నంబరును పోలీసులు సేకరించారు. రవి ఎప్పుడు నగరానికి వస్తాడో తెలుసుకోవడానికి ఆ నంబరుపై నిఘా పెట్టారు. ఇలా రోజులు గడిచాయి. రవి ఎప్పుడూ లాగానే విదేశం నుంచి వచ్చాడు.
ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఆ స్నేహితుడికి మెసేజ్ పంపాడు.ఆ మెసేజ్‌లో రవి రాసిన మాటలు ఇలా ఉన్నాయి మామా హైదరాబాద్ వచ్చా. ఆ ఒక్క చిన్న మెసేజ్‌తోనే అతని రాక నిర్ధారణ అయింది. పోలీసులకు సమాచారం అందగానే వెంటనే కదలి కూకట్‌పల్లి ఇంటికి చేరుకున్నారు. రవి ఇంట్లోనే ఉన్నాడు. ఎట్టకేలకు దొరికిపోయాడు. ఆ మెసేజ్ లేకపోతే బహుశా మరో రోజు జారిపోయేవాడు కూడా.
ఈ అరెస్టు సైబర్ క్రైమ్ పోలీసుల నైపుణ్యాన్ని చాటింది. ఒక చిన్న డిజిటల్ ఆధారం నుంచి పూర్తి ట్రాకింగ్ వరకు వారు చేసిన పని అద్భుతం. ఐబొమ్మ వంటి పైరసీ సామ్రాజ్యం నడిపిన వ్యక్తి ఒక్క మెసేజ్ వల్ల చిక్కుకున్నాడంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక తప్పు జరుగుతుందని స్పష్టమవుతోంది. ఈ కేసు ఇతర సైబర్ నేరగాళ్లకు గట్టి హెచ్చరికగా నిలుస్తుంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి