వైఎస్ఆర్సిపి మాజీ నేత విజయసాయిరెడ్డి పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.వైఎస్సార్ సీపీ పార్టీలో కీలకంగా ఉన్న ఈయన ప్రస్తుతం వైసీపీ పార్టీలో లేరు. అంతేకాదు రాజకీయాల్లోనే లేరు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని 2024 ఎన్నికల తర్వాత ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గా లేకపోయినాప్పటికీ ఎప్పుడూ ఏదో ఒక విషయం ద్వారా ఏపీలో హాట్ టాపిక్ గానే ఉంటారు. అయితే అలాంటి విజయసాయిరెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నాను అనేలా కొన్ని హింట్స్ ఇస్తున్నారు. ఇక విషయం ఏమిటంటే.. తాజాగా విజయ్ సాయి రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళినప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని రెడ్డి సంక్షేమ సంఘం వారు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

 ఈ కార్యక్రమంలో విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాజకీయాల్లో లేకపోయినప్పటికీ అవసరమైతే సొంత రాజకీయ పార్టీ కూడా పెడతాను. నా అవసరం ఉన్నప్పుడు కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను అని ప్రకటించడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. అయితే ఉత్తరాంధ్ర పర్యటనలోనే విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడంతో ఉత్తరాంధ్ర నుండి మళ్ళీ ఆయన రాజకీయాన్ని మొదలుపెట్టబోతున్నారని వార్తలు ఏపీలో వినిపిస్తున్నాయి. అంతే కాదు త్వరలోనే రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అవుతారనే విధంగా ఆయన మాటలు ఉండడంతో విజయసాయిరెడ్డి కం బ్యాక్ ఇన్ పాలిటిక్స్ అనే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంతే కాదు ఇప్పటికే రెండుసార్లు లోక్ రాజ్యసభ సభ్యుడు అయిన విజయ్ సాయి రెడ్డి వచ్చే ఎన్నికల్లో లోక్సభ కి పోటీ చేసి పార్లమెంటుకు వెళ్తారా అనే చర్చ కూడా జరుగుతుంది. అలాగే విజయ్ సాయి రెడ్డికి ఉత్తరాంధ్రలో మంచి పరిచయాలు ఉండడంతో కచ్చితంగా మళ్ళీ ఆయన ఉత్తరాంధ్ర నుండి రాజకీయం మొదలుపెడతారు అని పుకార్లు వినిపిస్తున్నాయి. మరి ఇదే నిజమైతే విజయ్ సాయి రెడ్డి సొంతగా పార్టీ పెడతారా.. లేక టిడిపిలో, జనసేనలో కలుస్తారా.. లేకపోతే వైయస్ఆర్సీపీలోనే కొనసాగుతారా అనేది తెలియాల్సి ఉంది.ఏది ఏమైనప్పటికీ తాజాగా విజయ్ సాయి రెడ్డి చేసిన కామెంట్లు మాత్రం మెయిన్ మీడియా లో సోషల్ మీడియాలో పలు చర్చలకు దారి తీసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: