ఎన్నికల వచ్చాయంటే చాలు రాజకీయ నేతలు హామీల వర్షం కురిపిస్తూ ఉంటారు. అలా వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొత్తగా పార్టీ పెట్టిన తమిళ వెట్రి కజగం అధినేత సినీ నటుడు విజయ్ తలపతి కాంచీపురంలో జిల్లాలోని కున్నం గ్రామంలో లోని జేప్పియార్ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో జరిగిన సభలో చెప్పుకొచ్చారు.ఆయన మాట్లాడుతూ..టీవీకే పార్టీ అధికారంలోకి వస్తే కాదు కచ్చితంగా  అధికారంలోకి వచ్చి తీరుతుంది. తమిళనాడు ప్రజలంతా నా వైపే ఉన్నారు. నేను అధికారంలోకి వచ్చాక ఇంటికో కారు ఇవ్వాలని ఉంది. త్వరలోనే  ఆ ఆశ నెరవేరే రోజులు రాబోతున్నాయి. ప్రతి ఇంటి ఖర్చులకు సరిపోయే ఉపాధి కల్పించడమే కాకుండా నాణ్యమైన విద్య,వైద్యం, అందరికీ ఇల్లు ఇంటికో బైక్ అందిస్తానని హామీ ఇస్తున్నాను .

ఇప్పటి ప్రభుత్వం మహిళల భద్రతకు ఎలాంటి భరోసా కల్పించలేదు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు పూర్తి భద్రత మాదే.. ఎంజీఆర్ తన రాజకీయ గురువు అయినటువంటి దివంగత మాజీ సీఎం అన్నా దురై ఫోటోని అన్నాడీఎంకే జెండాలో పెట్టుకున్నారు. కానీ అలాంటి అన్నాడీఎంకే పార్టీని హస్తగతం చేసుకున్న వాళ్లు మొత్తం ఏం చేస్తున్నారో నేను చెప్పాలనుకోవడం లేదు.పర్సనల్ గా నాకు అన్నాడీఎంకే పార్టీతో ఎలాంటి తగాదాలు లేవు. ఆ పార్టీ వాళ్లు మా మీద పగ పట్టినా కూడా వారిని అస్సలు పట్టించుకోము.

ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకులను ప్రశ్నించకుండా ఉండలేము. డీఎంకే నేతలు టీవీకే నేతలు, కార్యకర్తలను తెలివి తక్కువ దద్దమ్మలని విమర్శ చేసి అభాసు పాలయ్యారు. డీఎంకే పార్టీ నేతలకు సిద్ధాంతాలు, ప్రధాన లక్ష్యాలు అంటూ ఏమీ ఉండవు.ప్రజల ఆస్తి దోచుకోవడమే వారి ప్రధాన లక్ష్యం. డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తే నీట్ పరీక్షలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం వాళ్లు ఆ ఊసే ఎత్తడం లేదు. ఇంతవరకు నేను డిఎంకే పార్టీని విమర్శించలేదు. కానీ ఇప్పటి నుండి డీఎంకే పార్టీ నేను చేసే విమర్శలు తట్టుకోలేదు అంటూ ప్రసంగించారు విజయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: