తెలంగాణ రాష్ట్రంలోని పల్లెల్లో ఎన్నికల వేడి రాజుకుంది. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రావడంతో పల్లెలు మొత్తం ప్రచారాలతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలుగా నిర్ణయించింది. మొదటి విడత ఎన్నికలు డిసెంబర్  11న, డిసెంబర్ 14న, డిసెంబర్ 17వ తేదీన నిర్వహించనున్నారు. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అలా నడుస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అని చెప్పి దానిపై చట్టం చేయాలనుకుంది. కానీ గవర్నర్,కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకపోవడంతో పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది. ఈ విధంగా కాంగ్రెస్ లో పోటీ చేసే అభ్యర్థులకు సింహ భాగం బీసీలకు ఇవ్వాలని నిర్ణయించుకుంది.

 కాబట్టి పార్టీ నుంచి 42% రిజర్వేషన్ సీట్లు ఇవ్వాలని అనుకుంటుంది. ఇదిలా నడుస్తున్న సమయంలో  ప్రతిపక్షాల్లో పెద్దగా సర్పంచ్ ఎన్నికలపై ఆసక్తి ఉన్నట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా చాలా గ్రామాల్లో జనరల్ సీటు కేటాయించడం వల్ల ఆ సీట్లలో ఎక్కువ మంది బీసీలే పోటీకి ముందుంటున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా బీసీలకి ప్రాధాన్యత ఇస్తుంది. అయితే ఇతర పార్టీల నుంచి పోటీ చేసేవారు చాలా ఇరుకునపడ్డారు. ముఖ్యంగా 42% పార్టీ పరంగా కాంగ్రెస్ అమలు చేస్తూ ఉండడంతో ఇతర పార్టీల నుంచి అది అమలు చేయడం చాలా కష్టం అవుతుంది.

 దీనివల్ల చాలామంది గ్రామాల్లో ఉండే బీసీలు, బీసీ అభ్యర్థులకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇదే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రామాల్లో మంచి మైలేజ్ రావాలని  జిల్లాల టూర్లు పెట్టుకున్నారు. ఒకటో తేదీ నుంచి టూర్లు ప్రారంభమవుతాయి. దీంతో ఆయన గ్రామాల్లో చేసే అభివృద్ధిపై  ఉపన్యాసం అందిస్తారు. అలా గ్రామాల్లో సీఎం మాటల వల్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఇందిరమ్మ చీరలు కూడా ఈ మధ్యకాలంలోనే పంపిణీ చేయడంతో మహిళలంతా చాలా ఆనంద పడుతున్నారు. ఈ విధంగా అన్ని అంశాలు కలిసి వచ్చేటట్టు చేసి సర్పంచ్ ఎన్నికలకు సంసిద్ధం అయింది కాంగ్రెస్ సర్కారు.

మరింత సమాచారం తెలుసుకోండి: