ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది స్క్రబ్ టైఫస్ అనే వైరస్. ఈ ప్రాణాంతక వ్యాధి నివారణకు టీకా లేకపోవడం.. తక్షణ అప్రమత్తత, ముందు జాగ్రత్తగా ఉండడమే సరైన మార్గమని వైద్యులు సైతం తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా ఈ కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వైరస్ వల్ల మరణాల సంఖ్య పెరగడంతో ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. శరీరంపై ఏదైనా కీటకం కుట్టిన,గాయం లాంటి మచ్చలు ఏర్పడిన, దద్దుర్లు వంటివి కనిపించిన ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయవద్దని వైద్యుల సైతం హెచ్చరిస్తున్నారు.


ముఖ్యంగా ఎవరికైనా రెండు మూడు రోజుల నుంచి తలనొప్పి, జ్వరం ,ఒళ్ళు నొప్పులు, నీరసం  వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలని, స్క్రబ్ టైఫస్ పరీక్ష ద్వారా ఈ వ్యాధిని గుర్తించి సరైన సమయంలో యాంటీబయోటిక్ చికిత్స అందిస్తే బయటపడవచ్చు అని తెలియజేస్తున్నారు. ఈ స్క్రబ్ టైఫస్ తో మరణించిన వారి విషయానికి వస్తే..

1). పల్నాడు జిల్లాకు చెందిన ఎం జ్యోతి (10) -నవంబర్1
2). బాపట్ల జిల్లాకు చెందిన ఎస్కే మస్తాన్ బి (43)హనవంబర్ 14)
3). పల్నాడు జిల్లాకు చెందిన వై నాగమ్మ (64) నవంబర్- 16)
4). విజయనగరం జిల్లాకు చెందిన రాజేశ్వరి (40) - నవంబర్ 26
5). నెల్లూరు ప్రాంతానికి చెందిన సంతోషి (5)- డిసెంబర్ 4

ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది అంటే.. నల్లిని పోలిన చిగ్గర్ మైట్ అనేటువంటి కీటకం ద్వారా ఇది మనుషులకు వ్యాపిస్తుంది. ఇవి ఎక్కువగా ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్యలోనే ఉంటాయి. పంట పొలాలలో, తోటలో పనిచేసే రైతులు, గడ్డి మైదానాలు, పశువుల పాకలలో ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నదట.


ఈ వ్యాధి కట్టడి చేయాలంటే:
ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, రాత్రి వేళలో బయట నిద్రించకుండా ఉండడం, ఇంట్లో ఎలుకలు తిరగకుండా చర్యలు తీసుకోవాలి, పిల్లలు పెద్దలు సైతం పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించడం ఉత్తమం. పశువుల పాకలను శుభ్రంగా ఉంచడం ,అలాగే ప్రతిరోజు పరుపులు దుప్పట్లను పూర్తిగా శుభ్రం చేసినవి వాడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: