అనంతరం మాట్లాడుతూ మృతులలో నలుగురు పర్యాటకులు ఉన్నారని మిగిలిన వారంతా కూడా క్లబ్ సిబ్బందిగా గుర్తించినట్లు తెలియజేశారు. అయితే ఇందులో ముగ్గురు సజీవదహనంగా మారారని 20 మంది ఊపిరాడక మరణించినట్లుగా అధికారులు తెలియజేశారు. ఈ ప్రమాదం జరిగినటువంటి స్థలం రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి 12:00 ప్రాంతంలో మంటలు చెలరేగాయని సమాచారం రావడంతో అగ్నిమాపక యంత్రాలు , సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి చేశామంటు తెలిపారు.
ఈ విషయం తెలిసిన పరిపాలన అధికారులు కూడా వెంటనే ఆ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితులను గమనిస్తూ,సహాయక చర్యలతో మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదంలో చాలామందికి గాయాలైనట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. చాలా మృతదేహాలు వంటగది ప్రాంతంలో నుంచి వెలికి తీసారని అందుకే గ్యాస్ సిలిండర్ పేరు ఈ ప్రమాదం జరిగిందంటూ పోలీసులు తెలిపారు. క్లబ్లో చాలామంది ఉన్నప్పటికీ కొంతమంది బయటకు తప్పించుకోగలిగారని అక్కడ ఉండే స్థానికులు తెలిపారు. ఈ నైట్ క్లబ్ అగ్ని ప్రమాదానికి సంబంధించి సమగ్ర దర్యాప్తు నిర్వహించాలంటూ ముఖ్యమంత్రి సూచించారు. బాధ్యుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటు అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. పోలీసులు తెలుపుతున్న ప్రకారం అగ్నిమాపక భద్రత నిబంధనలను నైట్ క్లబ్ పాటించలేదంటూ తెలియజేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి