ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఒకవైపు తాను తీసుకున్న బాధ్యతలను పూర్తి చేస్తూనే, ప్రజా సమస్యల పైన ఏపీ అంతట పలు ప్రాంతాలలో పర్యటిస్తూ ఉన్నారు. తాజాగా అభిమానులకు ఒక కీలకమైన సూచన చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రేక్షకులు ఎవరు కూడా సినిమా పిచ్చిలో పడిపోవద్దంటూ హితవు పలికారు. ఏదైనా సరే ఒక పరిమితి వరకే ఉండాలని, పరిమితి మించి ఉండకూడదని తెలిపారు. ఈ విషయం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ, కానీ పవన్ కళ్యాణ్ చేసిన ఇలాంటి వ్యాఖ్యలు గొప్ప సూచనలు అంటూ అటు జనసేన నేతలు, కార్యకర్తలు ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తున్నారు.



పవన్ కళ్యాణ్ తాను ఓ నటుడిగా ఈ విషయాలను చెబుతున్నానని.. ఉదయం లేస్తే చాలు బూతులు తిట్టే వ్యక్తులను, టీవీలలో వారిని అసలు చూడకండి, సినిమా పిచ్చిలో పడిపోకండి. సినిమా అనేది కేవలం ఒక చిన్నపాటి వినోదం మాత్రమే.. దాన్ని జీవితంగా తీసుకోకండి.. నేను కూడా ఒక సినిమా నటుడీనే అయినా కూడా ఈ విషయాన్ని చెబుతున్నాను మన కోసం కష్టపడిన అబ్దుల్ కలాం వంటి వారిని ఆదర్శంగా తీసుకోండి ఎన్నో మంచి పనులు చేసిన పెద్దలను స్ఫూర్తిగా తీసుకోండి అని తెలిపారు.


మనం కూడా సమాజం కోసం ఏదైనా చేయాలి మీరందరూ ఈ మాటలను దృష్టిలో పెట్టుకోండి , మీ ఆలోచనలు ,మీ ప్రవర్తన, వ్యక్తిత్వం అనేది రేపటి దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందంటూ తెలియజేశారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పవన్ కళ్యాణ్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు నేటిజన్స్. ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ పేరు ఎక్కడ చూసినా వినిపిస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ చుట్టూనే రాజకీయాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ ఏ విషయం మాట్లాడిన అవి క్షణాలలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: