స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేసి రిటైరైయిన వారు ఇంకా కొన్ని క్వార్టర్లలో ఉండడంతో జరిమానాతో సహా అద్దెవసూలు చేస్తున్నారు .స్టీల్ ప్లాంట్ కోసమే కష్టపడి పని చేసిన వారికి ఉండడానికి అవకాశం ఇవ్వని యాజమాన్యం ఇప్పుడు hpcl సంస్థ కు ఎలా ఇస్తుంది అంటూ అక్కడ ఉద్యోగుల సైతం ప్రశ్నిస్తున్నారు?. స్టీల్ ప్లాంట్ లో 14,000 మంది ఉద్యోగులు ఉండేవారు. కానీ ఇప్పుడు వారి సంఖ్య 9,500కే చేరింది. దీంతో ప్లాంట్ ను పూర్తిస్థాయిలో నడపాలి అంటే మరో రెండు వేల మందిని రిక్రూమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
స్టీల్ ప్లాట్ ఉద్యోగుల కోసం మూడు దశాబ్దాల క్రితం 6వేల క్వార్టర్లను నిర్మించారు. అయితే అందులో చాలామంది లేకపోవడంతో చాలా క్వార్టర్లలో పాములు తిరుగుతున్నాయని ,పొదలు పెరిగిపోయని అధికారులు తెలియజేస్తున్నారు. టౌన్ షిప్ లో ఒక మూలకి ఉన్న సెక్టార్ 12 క్వాక్తర్లలో C, D టైప్ క్వార్టర్లు ఉన్నతాధికారుల కోసమే నిర్మించారు..అక్కడ అన్ని క్వార్టర్లు 1300 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 బెడ్రూమ్స్ కలిగి ఉంటాయి. అయితే ఇప్పుడు వాటిని hpcl సంస్థకు అద్దెకు ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. వీటిపైన hpcl కు లేఖలు రాసి ఆ క్వార్టర్లు తీసుకోవడానికి ఆసక్తిగా ఉంటే సమాధానం చెప్పాలని తెలియజేశారు. అలా ఒక 25 క్వార్టర్ల వరకు అద్దె ఇవ్వడానికి అనువుగా ఉంటుందని దీని ద్వారా వస్తే ప్రతి నెల రూ .5నుంచి రూ.6క్షల రూపాయల వరకు అద్దె వస్తుందని దీంతో కొంత ఆదాయం వస్తుందని ఆలోచనతో యాజమాన్యం ఉన్నట్లుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే E, C, D క్వాటర్లలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఉన్నప్పటికీ ,ఖాళీగా ఉంటే మరికొన్ని పాడైపోతాయని ఆలోచించే ఇలాంటి ప్రతిపాదన చేసామంటూ ప్లాంట్ యాజమాన్యం తెలియజేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి