ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే దాదాపు సంవత్సరంనర సమయం గడిచింది. ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తెలుగు దేశం , జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిపి కూటమి గా పోటీ లోకి దిగాయి. ఇక ఈ సారి ఎన్నికల్లో కూటమి కి ఎదురే లేకుండా పోయింది. ఈ సారి అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం , జనసేన , బీ జే పీ కూటమి ప్రభుత్వం అద్భుతమైన స్థానాలను దక్కించుకుంది. దానితో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య మంత్రి గా కొనసాగుతూ ఉంటే , జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి సంవత్సరంనర సమయం గడుస్తున్నా ఓ కమిషన్ లో మాత్రం అత్యంత ఖాళీలు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఏడాదిన్నర సమయం గడుస్తున్నా రాజ్యాంగ బద్ధ పదవుల్లో భారీ ఎత్తున ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. సమైక్య మానవ హక్కుల కమిషన్ విద్యుత్ నియంత్రణ మండలి లాంటి అతి పెద్ద కమిషన్లో అధిపతులు లేక అవి ఖాళీగా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సంస్థ లో కొన్ని పదవుల్లో కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాక ముందే ఖాళీలు ఏర్పడితే , మరికొన్ని పదవుల్లో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ఖాళీలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఖాళీలను త్వరగా భర్తీ చేసి అందులో ఎవరినైనా నియమిస్తే బాగుంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఎంతో ముఖ్యమైన ఈ కమిషన్లలో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది ... లేదో తెలియాలి. ఈ కమిషన్ లో ఖాళీలను భర్తీ చేస్తే ఎలాంటి వారిని నియమిస్తారు అనేది కూడా ఎంతో ముఖ్యంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: