ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న రాజకీయ నాయకులలో వై సి పి పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకరు. ఈయన వై సి పి పార్టీని చాలా సంవత్సరాల క్రితం స్థాపించాడు. వై సీ పీ పార్టీని స్థాపించిన తర్వాత ఈయన ఎంతో చురుగ్గా రాజకీయాల్లో పాల్గొన్నాడు. ఇకపోతే 2014 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వై సి పి పార్టీకి పెద్ద ఎత్తున అసెంబ్లీ స్థానాలు రాలేదు. అయినా కూడా ఆయన ఎక్కడా వెను తిరగలేదు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చాడు. ఇక 2019 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వై సి పి పార్టీకి అద్భుతమైన స్థాయిలో అసెంబ్లీ స్థానాలు దక్కాయి. దానితో జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి ముఖ్య మంత్రి గా కొన ఐదు సంవత్సరాల పాటు కొనసాగాడు. ఇక 2024 వ సంవత్సరం కూడా ఈయన పార్టీ అద్భుతమైన స్థాయిలో అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంటుంది అని , ఈయన మరో సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య మంత్రి అవుతాడు అని చాలా సర్వేలు చెప్పాయి. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వై సి పి పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది.

వై సి పి పార్టీ కి 2024 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 11 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దత్తాయి. దానితో చాలా మంది జగన్ కి ఇది భారీ ఎదురు దెబ్బ. ఈ స్థాయి ఎదురు దెబ్బ జగన్మోహన్ రెడ్డి కానీ , ఆయన పార్టీ శ్రేణులు కానీ అస్సలు ఊహించి ఉండరు. ఇంత తక్కువ అసెంబ్లీ స్థానాలు వచ్చాయి కాబట్టి జగన్ కొన్ని సంవత్సరాల పాటు సైలెంట్ గా ఉండి మళ్లీ ఎలక్షన్ల ముందు యాక్టివ్ అవుతారు అని కొంత మంది అనుకున్నారు. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వై సి పి పార్టీకి చాలా తక్కువ స్థానాలు వచ్చిన కూడా జగన్ మోహన్ రెడ్డి ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ప్రజా సమస్యలపై పోరాడడం మొదలు పెట్టాడు. దానితో వై సి పి పార్టీ శ్రేణులు ఆయన ప్రవర్తన పై అదిరిపోయే రేంజ్ లో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: